Sreeja Konidela third marriage news viral
Sreeja Konidela : ఇటీవల కాలంలో సెలబ్రిటీల డైవోర్స్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన డిస్కషన్ జరుగుతోంది. దానికి తోడు సెలబ్రిటీలు విడాకుల ప్రకటనలు సోషల్ మీడియా వేదికగానే వస్తుండటంతో ఏ చిన్న మార్పు వచ్చినా.. వాళ్లు డైవోర్స్ తీసుకోబోతున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కల్యాణ్ కూడా డైవోర్స్ తీసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. అయితే, ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు.శ్రీజ కొణిదెల డైవోర్స్ తీసుకోబోతున్నదని వార్తలు రావడానికి గల కారణం.. ఆమె తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో …. శ్రీజ కల్యాణ్ అని ఉన్న తన పేరును శ్రీజ కొణిదెలగా మార్చుకుంది.
అది గమనించిన నెటిజన్లు.. ఇదే సంకేతమని అంటున్నారు. అయితే, ఈ విషయమై మెగా ఫ్యామిలీ నుంచి కాని కల్యాణ్ దేవ్ నుంచి కాని ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. గతంలో సమంత తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో పేరును సమంత అక్కినేని నుంచి సమంత రూత్ ప్రభుగా మార్చుకుంది. ఈ నేపథ్యంలోనే శ్రీజ కూడా డైవోర్స్ ఇవ్వబోతున్నదనే చర్చ జరుగుతున్నది. ఈ సంగతులు అలా ఉంచితే… శ్రీజ కొణిదెల తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా పెట్టిన పోస్టు చర్చనీయాంశమవుతోంది.తన అన్నయ్య మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్‌తో కలిసి ముంబైకి హాలీడేకు వెళ్లిన శ్రీజ కొణిదెల.. అక్కడ చెర్రీతో దిగిన ఫొటోను ఇన్ స్టా వేదికగా పంచుకుంది.
sreeja konidela emotional post on instagram
‘ఇవే కౌగిలింతలు.. నేను సంతోషంగా బతుకుతున్నానని చెప్పడానికి కారణాలివే’ అని పేర్కొంటూ ఫొటో పోస్ట్ చేసింది. శ్రీజ కొణిదెల పెట్టిన క్యాప్షన్ చూసి ఆమె చాలా ఎమోషనల్ అయిందని నెటిజన్లు అంటున్నారు. శ్రీజ హాలీడేకు తన భర్తతో కాకుండా అన్నయ్యతో ఎందుకు వెళ్లిందని ఈ సందర్భంగా కొందరు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇకపోతే ఈ ఫొటో చూసి శ్రీజ కొణిదెల అక్క సుస్మిత కొణిదెల తనను వదిలేసి ముంబైకి హాలీడేకు వెళ్లిపోయినందుకు థాంక్స్ అని కామెంట్ చేసింది.
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
This website uses cookies.