Home » Entertainment » Sreeja Konidela Third Marriage News Viral
Entertainment

Sreeja Konidela : మూడో పెళ్లికి సిద్ధ‌మైన శ్రీజ‌.. చిరంజీవిని ఒప్పుకున్నాడా, ఒప్పించారా?

Authored By
Sam C
The Telugu News | Published on: July 19, 2022, 12:30 pm
Advertisement

Sreeja Konidela : సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది సెల‌బ్స్ ఒక‌టి క‌న్నా ఎక్కువ‌గా పెళ్లిళ్లు చేసుకుంటున్న విష‌యం తెలిసిందే. రెండు లేదా మూడు పెళ్లిళ్లు చేసుకుంటూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. తాజాగా మెగా డాటర్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మూడో పెళ్ళి చేసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటికే రెండు పెళ్లిలు చేసుకుని..ఒక భర్త కి అఫిషీయల్ గా డివర్స్ ఇచ్చి..మరో భర్తకి కూడా డివర్స్ ఇచ్చిన్నట్లే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఫస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకుని ఓ బిడ్డను కన్నా శ్రీజ..ఆ తరువత అతని డివర్స్ తీసుకుని..నాన్న చెప్పిన కళ్యాణ్ దేవ్ ను పెళ్ళాడింది.అయితే అతనితో ఓ బిడ్డను కన్నాక..ఏవో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారట.

Advertisement

శ్రీజ తన సోషల్‌ మీడియా అకౌంట్ల నుంచి తన భర్త కళ్యాణ్‌ దేవ్‌ పేరు తొలగించడం హాట్‌ టాపిక్ అయింది. శ్రీజ క‌ళ్యాణ్‌గా ఉన్న శ్రీజ.. ఇప్పుడు తన పేరుని శ్రీజ కొణిదెల‌గా మార్చుకుంది. అప్ప‌టి నుండి అనేక అనుమానాలు తలెత్తాయి. కొద్ది రోజులుగా శ్రీజ మూడో పెళ్ళి వార్త ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఆమె తన బెస్ట్ ప్రెండ్ అయిన ఓ కుర్రాడి పెళ్లి చేసుకోబోతుందని సినీ వర్గాలల్లో ఓ వార్త జోరుగా ప్రచారం జరుగుతుంది. దీని పై ఇప్పటికే పలువురు సీనియర్ నటీమణులు స్పందించి…శ్రీజ మూడో పెళ్ళి చేసుకోకపోతేనే బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చారు.

Sreeja Konidela third marriage news viral

Advertisement

Sreeja Konidela : శ్రీజ మూడో పెళ్లి..

శ్రీజ విషయంలో అసలు మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతుందనేది మరికొన్ని రోజుల్లో పూర్తి క్లారిటీ రానుంది. ఇంత జరుగుతున్న కూడా ఒక్కరు కూడా బయటికి వచ్చి జరిగిన విషయం ఇది.. జరుగుతున్న మ్యాటర్ ఇదే అంటూ క్లారిటీ ఇవ్వడం లేదు. మరోవైపు కళ్యాణ్ దేవ్ తన సన్నిహితులతో పరిస్థితులు చెప్పుకుని బాధ పడుతున్నాడని వార్తలు వస్తున్నాయి.చిరంజీవికి శ్రీజ మూడో పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదట. కానీ, పవన్ కళ్యాణ్ నే దగ్గరుండి ఒప్పించారట. అమ్మాయి సంతోషం కన్నా మనకి ఏది ముఖ్యం కాదు అంటూ చిరు కి చెప్పి ఒప్పించారట. శ్రావణమాసంలో నిశ్చితార్ధం..నవంబరులో పెళ్లి అన్నట్లు మెగా కాంపౌండ్ నుండి వార్తలు వినిపిస్తున్నాయి. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి