Home » Entertainment » Sreeleela Killing Looks Viral
Entertainment

Sreeleela : కేక పెట్టించే అందాల‌తో కిల్ చేస్తున్న శ్రీలీల‌.. బ్యూటీ లుక్స్‌కి ఫిదా..!

Authored By
Sam C
The Telugu News | Published on: June 10, 2022, 5:00 pm
Advertisement

Sreeleela : ఇటీవ‌ల టాలీవుడ్‌కి కొత్త ముద్దుగుమ్మ‌లు ప‌రిచ‌యం అవుతున్నారు. ఒక్క సినిమాతో ఓవ‌ర్‌నైట్ స్టార్స్‌గా మారుతూ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.ఈమె చేసింది ఒక్క సినిమా అయినప్పటికీ ఈమె మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయిందనే చెప్పాలి. ఈమె అందం, అభినయం అన్ని కూడా ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తాయి.శ్రీలీల రాఘవేంద్రరావు పర్వేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి సందడి సినిమా ద్వారా వెండి తెరమీద అడుగు పెట్టింది.

Advertisement

ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించాడు. ఈ సినిమా తర్వాత శ్రీలీల వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో దూసుకు పోతుంది. శ్రీలీల పేరు ఇప్పుడు టాలీవుడ్ లో బాగానే వినిపిస్తోంది. ఆ సినిమా మంచి హిట్ అవడంతో టాలీవుడ్ నుంచి బోలెడు మంచి ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ఈ మధ్యనే బరువు కూడా తగిన శ్రీలీల తాజాగా ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ సరసన హీరోయిన్ గా “ధమాకా” సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత ఏకంగా సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తో నటించే అవకాశాన్ని చేజిక్కించుక్కుంది ఈ భామ.

sreeleela killing looks viral

Advertisement

Sreeleela : శ్రీలీల అందాల‌కి దాసోహం..

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం “ఎఫ్ 3” సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి బాలకృష్ణ హీరోగా ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో శ్రీలీల ముఖ్య పాత్ర పోషించనున్నారట. అయితే బాలకృష్ణ సరసన హీరోయిన్ గా కాకుండా శ్రీలీల ఈ సినిమాలో బాలకృష్ణ కూతురి పాత్రలో కనిపించబోతున్నారు అని ఒక టాక్ నడుస్తోంది.మ‌హేష్ బాబు సినిమాలోను శ్రీలీల న‌టించ‌నుంద‌ని తెలుస్తుంది. అయితే సోష‌ల్ మీడియాలోను తెగ యాక్టివ్‌గా ఉంటూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంటుంది శ్రీలీల‌. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ డ్రెస్‌లో మైండ్ బ్లోయింగ్ లుక్స్‌లో క‌నిపిస్తూ కేక పెట్టిస్తుంది. ప్ర‌స్తుతం శ్రీలీల పిక్స్ మైమ‌ర‌చిపోయేలా చేస్తున్నాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి