Home » Entertainment » Sreemukhi And Hero Roshan At Dasara Dosti
Entertainment

Sreemukhi : టచ్‌కి అద్బుతమైన రియాక్షన్ ఇచ్చింది ఎవరు?.. శ్రీముఖి కొంటె ప్రశ్న

Authored By
Cinema Desk
The Telugu News | Published on: October 6, 2021, 11:30 am
Advertisement

Sreemukhi  : శ్రీముఖి బుల్లితెరపై ఒక్కోసారి తన మాటలతో హద్దులు దాటుతూ ఉంటుంది. డబుల్ మీనింగ్‌లతో రెచ్చిపోతోంది. ఈ మధ్య కామెడీ స్టార్స్ అంటూ రచ్చ చేయడం ప్రారంభించింది. ఇక స్పెషల్ ఈవెంట్లు, పండుగల ప్రోగ్రాంలు అంటే శ్రీముఖి అల్లరి మామూలుగా ఉండదు. వచ్చే సెలెబ్రిటీలను ఆడుకుంటూ ఉంటుంది. వారితో కలిసి వారి మీదే పంచులు వేస్తుంటుంది. అయితే ఈ సారి దసరాకు స్పెషల్ ప్రోగ్రాంను జీ తెలుగు ప్లాన్ చేసింది. అందులో శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరిస్తోంది.

Advertisement

Sreemukhi And Hero Roshan At Dasara Dosti

దసరా దోస్తీ అంటూ రాబోతోన్న ఈ ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమోలు వదులుతున్నారు. తాజాగా వదిలిన ప్రోమోలో పెళ్లి సందడి టీం వచ్చింది. అందులో హీరోగా నటించిన శ్రీకాంత్ తనయుడు రోషన్ స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇదే సినిమాలో కమెడియన్‌గా నటించిన షకలక శంకర్ కూడా వచ్చాడు. శ్రీకాంత్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నట్టుగా.. నాటి పెళ్లి సందడి సీన్‌ను స్టేజ్ మీదే రీ క్రియేట్ చేసేందుకు దసరా దోస్తీ ఈవెంట్ ప్లాన్ చేసింది.

Advertisement

Sreemukhi And Hero Roshan At Dasara Dosti

Sreemukhi  రోషన్‌పై శ్రీముఖి కౌంటర్లు..

సౌందర్య లహరి అంటూ ఈవెంట్లో పాల్గొన్న బుల్లితెర తారలందరినీ టచ్ చేసుకుంటూ వెళ్లాడు రోషన్. ఇక ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అయ్యారు. తన సౌందర్య లహరిని వెతుక్కుంటూ అలా రోషన్ వెళ్లిపోయాడు. ఇక శ్రీముఖి ఎంట్రీ ఇచ్చి కౌంటర్ వేసింది. మీ టచ్‌కు అద్భుతమైన రియాక్షన్ ఇచ్చింది ఎవరు అని అడిగేసింది. రోషన్ ఓ పేరు చెప్పేశాడు. కానీ ఓ అమ్మాయి మాత్రం అటు టచ్ చేస్తే ఎటో చూసింది అంటూ షకలక శంకర్ సెటైర్ వేశాడు.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి