Sreemukhi: ఎంటర్‌టైన్మెంట్‌కు కేరాఫ్‌గా ఉండేందుకుగాను స్టార్ మా వారు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘బిగ్ బాస్’ కోసం ప్రేక్షకులు స్టార్ మాను చూస్తూనే ఉండగా, ఇంకొంత వినోదం పంచేందుకుగాను ‘కామెడి స్టార్స్’ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా వారు ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా, అది ఆకట్టుకుంటోంది. ‘ఒక టికెట్ మీద ఆరు ఫన్నీ స్టోరిస్..మీకు తప్పకుండా వినోదం అందిస్తాం’ అనే క్యాప్షన్ తో కామెడి స్టార్ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోగ్రాం సండేను ఫన్ డేగా మార్చేస్తుందని పేర్కొన్నారు.
ఇకపోతే ‘జబర్దస్త్’ ప్రోగ్రాం మాదిరిగానే ఈ షోలోనూ ఆరుగురు టీమ్‌గా ఫామ్ అయి ఫన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ షోకు జడ్జిలుగా శేఖర్ మాస్టర్, శ్రీదేవి విజయ్ కుమార్ వ్యవహరిస్తున్నారు. ముక్కు అవినాశ్ స్కిట్‌లో అవినాశ్ పంచ్ డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ షోలో కొత్త వారిని తన స్కిట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తుండగా, తనను ఎందుకు స్కిట్‌లో పెట్టుకోవడం లేదని శ్రీముఖి ముక్కు అవినాశ్‌ను అడుగుతుంది.
దానికి కౌంటర్‌గా అవినాశ్ తనకు శ్రీముఖి ఆడపిల్లలా కనబడలేదని చెప్పి నవ్వులు పూయించినట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఇకపోతే శ్రీముఖి తనను ఆడపిల్ల కాదని ముక్కు అవినాశ్ అనడంతో అతడిని కొట్టి తన యాంకరింగ్ పొజిషన్‌లోకి వెళ్లిపోతుంది. ఇక హరి, అశు పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయింది ప్రోమోలో. సద్దాం తన స్కిట్‌లో తాను పెద్ద పెద్ద వాళ్లకు యాక్టింగ్ నేర్పించినట్లు చెప్తాడు. అది నిజమే అనుకున్న శ్రీముఖి వారు ఎవరో అని అడగ్గా.. 90 ఏళ్లకు పైబడిన వారు అని చెప్పి ఫన్నీ బాంబ్ పేల్చాడు సద్దాం. దాంతో శ్రీముఖి సద్దాంను కొట్టేస్తుంది.
ఇక చివరగా ‘చల్తీకా నామ్ గాడీ హై… చెమటోడిస్తే రోటీ హై’ అన్న పాటకు జడ్జిలు, షోలో పాల్గొన్న వారు అందరూ హుషారుగా స్టెప్స్ వేశారు. శేఖర్ మాస్టర్, శ్రీదేవి విజయ్ కుమార్ జంటగా డ్యాన్స్ చేశారు. చివరలో హరి స్టేజిపై నుంచి కింద పడ్డట్లు చూపించి ఎపిసోడ్‌పై మరింత ఇంట్రెస్ట్ కలిగేలా చేశారు. ప్రతీ ఆదివారం 1.30 గంటలకు ఈ ‘కామెడి స్టార్స్’ ప్రోగ్రాం టెలికాస్ట్ అవుతుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.