Home » Entertainment » Sreemukhi Satires On Avinash In Aadivaaram With Star Maa Parivaaram
Entertainment

Sreemukhi : అది చెప్పు ముందు..గాడిద.. అవినాష్ పరువుతీసిన శ్రీముఖి

Authored By
Tech Desk
The Telugu News | Published on: October 1, 2022, 3:30 pm
Advertisement

Sreemukhi : శ్రీముఖి, అవినాష్ ఫ్రెండ్ షిప్ గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ మూడో సీజన్లో శ్రీముఖి సందడి చేసింది. నాలుగో సీజన్లో అవినాష్ రచ్చ చేశాడు. అవినాష్ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లేందుకు సాయం చేసింది కూడా శ్రీముఖినే. మల్లెమాల నుంచి బయటకు రావాలంటే బాండ్ ప్రకారం పది లక్షలు చెల్లింది. అది చెల్లిస్తేనే.. బిగ్ బాస్ ఇంట్లోకి అవినాష్ అడుగుపెట్టగలడు. అప్పుడు శ్రీముఖి సాయం చేసిందట. అసలే పీకల్లోతు అప్పుల్లో ఉన్న అవినాష్‌ను శ్రీముఖి కాపాడింది. అలా డబ్బులివ్వడంతో శ్రీముఖి అవినాష్ బంధం మరింత ఎక్కువగా పెరిగింది.

Advertisement

ఆఫ్ స్క్రీన్‌లో ఆన్ స్క్రీన్‌లో ఈ ఇద్దరి కెమిస్ట్రీ బాగానేఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి ఎన్నో షోలు, ఈవెంట్లు చేస్తుంటారు. ఇద్దరూ కలిసి హోస్టింగ్ చేస్తూ ఉంటే అందరూ నవ్వాల్సిందే. శ్రీముఖి మీద అవినాష్ ( avinash ) అదిరిపోయే కౌంటర్లు వేస్తుంటాడు. వాటికి ధీటుగా శ్రీముఖి కూడా పంచులు వేస్తుంటుంది. ఇప్పుడు శ్రీముఖి అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా అన్ని చోట్లా కనిపిస్తోంది. ఈటీవీ, జీ తెలుగు, స్టార్ మా అంటూ ఈవెంట్లు, స్పెషల్ షోలు చేసుకుంటూ పోతోంది. ఇప్పుడు స్టార్ మాలో శ్రీముఖి కొత్త షోను చేస్తోంది.

Sreemukhi Satires on avinash in Aadivaaram with Star Maa Parivaaram

Advertisement

ఆదివారం.. విత్ స్టార్ మా పరివారం అంటూ ప్రతీ ఆదివారం 11 గంటలకు వస్తుంది. ఇందులో స్టార్ మా సీరియల్ తారామణులు వస్తుంటారు. తాజాగా ఓ ప్రోమోను వదిలారు. ఇందులో స్టార్ మా సీరియల్స్ కోడళ్లు, అత్తలు వచ్చారు. అత్తల కేటగిరీలో హరిత గ్యాంగ్ వచ్చింది. కోడళ్ల గ్యాంగులో సుహాసిన గ్యాంగ్ వచ్చింది. ఇక అత్తలు కోడళ్లు తమ తమ ఆధిపత్యాన్ని చూపించేందుకు ప్రయత్నించారు. కూలర్ రూలర్ అంటూ గృహలక్ష్మీ కస్తూరీ అంటే.. విత్తనం పెత్తనం అని కోడళ్ల గ్యాంగ్ కౌంటర్లు వేసింది.ఇక ఇందులో అవినాష్ శ్రీముఖి కామెడీ కూడా బాగానే వర్కవుట్ అయింది. చీరల వ్యాపారస్థుడిగా అవినాష్ వచ్చాడు. వాళ్లు వేసుకున్నవి వీళ్లు వేసుకున్నవి అని చెబుతుంటాడు అవినాష్. అంటే ఇవన్నీ వాడేసినవా? అని కౌంటర్లు వేస్తారు అత్తలు. అలా కాదు.. ఆ టైపు మోడల్స్ అని అవినాష్ అంటే..అది చెప్పు ముందు గాడిద అంటూ బాలయ్య స్టైల్లో శ్రీముఖి కౌంటర్లు వేసింది.

Tech Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి