Home » Entertainment » Sreemukhi Video Viral In Social Media
Entertainment

Sreemukhi : గేదెలకు గడ్డి కోసుకొస్తానంటున్న శ్రీముఖి… ఎందుకో తెలుసా?

Authored By
mallesh
The Telugu News | Published on: February 6, 2022, 8:30 pm
Advertisement

Sreemukhi : కొవిడ్ థర్డ్ వేవ్ స్టార్ట్ అవుతుందని, కేసులు బాగా పెరుగుతున్నాయని స్కూల్స్ కు గత నెలలో సెలవులు ప్రకటించిన సంగతి అందరికీ విదితమే. సంక్రాంతి సెలవులను ఈ నేపథ్యంలోనే పొడిగించారు. తాజాగా అనగా ఈ నెల 1న పాఠశాలలను పున: ప్రారంభించారు. కాగా, విద్యార్థుల హాజరు శాతం ఈ క్రమంలో మెల్లగా పెరుగుతోంది. కాగా, కొంత మంది విద్యార్థులు పాఠశాలలకు వెళ్లబోమని మారాం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాంకర్ శ్రీముఖి కూడా స్కూల్ పిల్ల అయిపోయింది.

Advertisement

స్కూల్ పిల్లలాగా మారిపోయిన శ్రీముఖి.. ‘నేను స్కూల్ కు వెళ్లబోను’ అనే క్యాప్షన్ తో క్యూట్ వీడియో షేర్ చేసింది. అందులో శ్రీముఖి క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ స్కూల్ పిల్ల మాదిరిగానే డైలాగ్స్ చెప్తోంది. అలా చక్కగా సోఫాపైన పడుకుని తాను స్కూల్ కు వెళ్లనని చెప్తోంది.ఎందుకని ఒకరు ప్రశ్నించగా, ఇంటికాడే ఉండి ఏదేని పనులు చూసుకుంటానంటుంది. అప్పుడు ఏం పనులు చూసుకుంటావని అడగగా, గేదె పనులు చూసుకుంటానని అంటుంది.

sreemukhi video viral in social media

Advertisement

Sreemukhi : అలా క్యూట్‌గా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తున్న శ్రీముఖి..

గేదెలు లేవని తల్లి చెప్పగా, డ్యాడీని కొనాలని చెప్తోంది. పేడకళ్లు తీయాలని తల్లి చెప్పగా తాను చేయబోనని అంటోంది శ్రీముఖి. మరి ఏం చేస్తావ్? అని అడగగా, తాను గడ్డి కోసుకొస్తానని, నీళ్లు పెడతానని అంటుంది శ్రీముఖి. ఈ వీడియోను రీల్స్, శ్రీముఖి, స్కూల్ లైఫ్ హ్యాష్ ట్యాగ్స్ తో శ్రీముఖి షేర్ చేయగా, ఆ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి