Prabhas will Chances are announced at any time
Prabahs : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి విషయం ఇప్పటికీ సస్పెన్స్‌గానే మారింది. ఆయన పెళ్లిపై ఎప్పటి నుండో అనేక ప్రచారాలు సాగుతున్నాయి.ఇదిగో అదిగో అంటూ కాలం గడిపేస్తున్నారు. అయితే ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఆయన అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ప్రభాస్‌ని పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అమ్మాయిలు రెడీగా ఉంటారు. ఓ నటీ అయితే ప్రభాస్ పెళ్లి అయితే కానీ తాను పెళ్లి చేసుకోను అని చెబుతుంది.. ఆమెనే శ్రీరాపాక. నటీ కాకముందు పలు సినిమాలకి ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేసిన శ్రీరాపాక.. ఆర్జీవీ నగ్నం షార్ట్ ఫిలింతో హీరోయిన్‌గా మారింది.
బిగ్ బాస్ నాన్ స్టాన్ ఎంటర్‌టైన్‌మెంట్ షోతో అందరి దృష్టి ఆకర్షించిన శ్రీరాపాక రెండో వారంలో హౌజ్ నుండి బయటకు వచ్చింది. ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలు చేస్తూ బిజీబిజీ అయిపోతుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ … ప్రభాస్ అంటే తనకి చాలా ఇష్టమని, తాను ఇంటర్ చదువుతున్న టైమ్ నుంచే ప్రభాస్ అంటే పిచ్చి అని చెప్పుకొచ్చింది. ప్రభాస్ నటించిన ఈశ్వర్ మూవీ బాగా ఇష్టమని, అప్పటి నుంచి ప్రభాస్ అంటే క్రష్ అని చెప్పింది. మరి ఆయనను పెళ్లి చేసుకుంటారని అడగ్గా.. అంతకంటే అదృష్టమా అని సమాధానం ఇచ్చింది. అప్రభాస్‌ను పెళ్లి చేసుకుని ఒక్కరోజు జీవించిన చాలు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
sri rapaka wants to marry prabhas
అయితే ఎలాగు అది జరగదు కాబట్టి ప్రభాస్ పెళ్లి చేసుకునేంత వరకు వెయిట్ చేస్తానని, ఆయన పెళ్లి తర్వాతే తను పెళ్లి పీటలు ఎక్కుతానంది. ఒకవేళ ఆయన పెళ్లి చేసుకోకపోతే తాను కూడా ఎప్పటికీ మ్యారేజ్ చేసుకోనని పేర్కొంది. ఇకపోతే ప్రభాస్ పెళ్లి అనుష్కతో ఉంటుందని వస్తున్న వార్తలకైతే లెక్కే లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అయిన ప్రభాస్- అనుష్క మూడు మూళ్ళ బంధంతో ఒక్కటి కాబోతున్నారని చాలా సార్లు విన్నాం. అయితే ఈ ఇష్యూపై ప్రభాస్ పెద్దమ్మ, రెబల్ స్టార్ కృష్ణం రాజు సతీమణి శ్యామల దేవి రియాక్ట్ అవుతూ ప్రభాస్- అనుష్కల పెళ్లి జరగదని, వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ తప్పితే వాళ్ళ మధ్య అలాంటి ఫీలింగ్స్ లేవని చెప్పారు. మరోవైపు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిన ప్రతిసారి ఏదోలా దాటేస్తూ వస్తున్నారు ప్రభాస్.
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సందడి…
Modi : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…
Trump : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…
This website uses cookies.