Home » Entertainment » Sri Reddy New Style Cooking Recipe Video
Entertainment

Sri Reddy : శ్రీ రెడ్డి మ‌ట‌న్ తిల్లి తింటే త‌ల్లి అయిపోవ‌డం ఖాయ‌మ‌ట‌..!

Authored By
Sam C
The Telugu News | Published on: July 9, 2022, 1:00 pm
Advertisement

Sri Reddy : కాస్టింగ్ కౌచ్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ శ్రీ రెడ్డి. ఓ న్యూస్ ఛానల్ లో యాంకర్ గా కెరీర్ ను మొదలు పెట్టిన శ్రీరెడ్డి.. తర్వాత పలు సినిమాల్లో కూడా నటించింది. ఈమె పలు ఇంటర్వ్యూల్లో చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి.అయితే 2019 నుండీ ఈమె చాలా సైలెంట్ అయిపోయింది. చెన్నైలో సెటిల్ అయ్యింది. ప్రశాంతంగా తన యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటుంది.ఈ మధ్య కాలంలో ఈమె ఎక్కువగా వంటలకు సంబంధించిన వీడియోలు చేస్తుంది. ఇవి చాలా మంది చేస్తున్నావే కదా..

Advertisement

ఇందులో కొత్తేముంది అనుకుంటునారా. అయితే శ్రీ రెడ్డి వంట‌కాల స్టైల్ కాస్త వెరైటీగా ఉండడం స‌హ‌జం. అందాలు ఆర‌బోస్తూ ఈమె చేసే వంట‌కాలు చూస్తే అంద‌రికి తెగ మైమ‌ర‌చిపోతుంటారు. ఆమె ఏ స్టైల్లో వంటల వీడియోలు చేస్తుందో,ఒకటి రెండు వీడియోలు చూస్తే మీకే అర్ధమైపోతుంది. ఇదిలా ఉండగా.. గ్లామర్ తో రచ్చ చేసే శ్రీరెడ్డి అప్పుడప్పుడు చీరకట్టులో కనిపిస్తేనే ప్రేక్షకులు షాక్ అవుతూ ఉంటారు. అయితే వంట‌లు వండే స‌మయంలో ఎక్కువ‌గా చీర‌క‌ట్టులోనే క‌నిపిస్తుంది శ్రీ రెడ్డి.

Sri Reddy New Style Cooking Recipe Video

Advertisement

Sri Reddy : శ్రీ రెడ్డి స్టైల్‌లో..

తాజాగా మ‌ట‌న్ తిల్లి కూర వండిన శ్రీ రెడ్డి గోదావ‌రి స్టైల్‌లో ఈ కూర‌ని వండిన‌ట్టు చెప్పింది. ఇది తింటే త‌ల్లి అయిపోవ‌డం ఖాయం అంటుంది. ఆరుబ‌య‌ట ప్ర‌శాంతంగా కూర్చొని శ్రీ రెడ్డి ఎంచ‌క్కా ఈ కూర చేసింది. ఇది చాలా చాలా బాగుంది అని ఈ అమ్మ‌డు తెగ చెప్ప‌డంతో అందరికి నోరూరిపోతుంది. ప్ర‌స్తుతం శ్రీ రెడ్డి తిల్లి కూర వీడియో వైర‌ల్‌గా మారింది. ఇటీవ‌ల శ్రీ రెడ్డి హోట‌ల్స్ కి వెళ్లి మ‌రి అక్క‌డ కూడా ప‌లు వంట‌కాలు రుచి చూసింది. అంతే కాదు వాటికి సంబంధించిన రివ్యూ కూడా ఇచ్చింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి