
Sri Satya Loses task in Bigg Boss 6 Telugu
Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ ఇంట్లో శ్రీ సత్య వెరైటీగా అనిపిస్తోంది. ఆమె పనులు చేయడం తక్కువ.. మాటలు చెప్పడం మాత్రం ఎక్కువ అన్నట్టుగా ఉంది. తినడానికి బిగ్ బాస్ ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఆటల్లోనూ ఏ మాత్రం సీరియస్‌నెస్ కనిపించడం లేదు. అలా మొత్తానికి గ్లామర్ షోతో శ్రీ సత్య నెట్టుకొస్తోంది. అలా అని మరీ ఎక్స్‌పోజింగ్ ఏమీ చేయడం లేదు. కానీ పొట్టి బట్టల్లో కనిపిస్తూ సందడి చేస్తోంది. బిగ్ బాస్ ఇంట్లో రెండో వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ మొదలైంది.
ఇందులో భాగంగా అందరికీ ఓ బొమ్మను ఇచ్చాడు. ఆ బొమ్మను బిడ్డగా భావించాలని, దాని బాగోగులు చూసుకుంటూ సంరక్షించుకోవాలని చెప్పుకొచ్చాడు బిగ్ బాస్. వేరే కంటెస్టెంట్ల బొమ్మను లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరియాలో ఎవ్వరైనా పడేయొచ్చని తెలిపాడు. అలా చేస్తే బొమ్మని కోల్పోయిన కంటెస్టెంట్లు ఆట నుంచి తప్పుకుంటారు. దీంతో గీతూ మిగతా కంటెస్టెంట్ల బొమ్మల మీద పడింది. ఎవరి బొమ్మ దొరికితే వాళ్లది తీసుకెళ్లి లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరియాలో పడేస్తూ వచ్చింది. భోజనానికి అందరూ సిద్దమయ్యారు.
Sri Satya Loses task in Bigg Boss 6 Telugu
ప్లేటులో భోజనం పెట్టుకునేందుకు తన బొమ్మని పక్కన పెట్టేసింది సత్య. దీంతో ఆ బొమ్మను ఎత్తుకెళ్లింది గీతూ. అది చూసినా కూడా సత్య రియాక్ట్ అవ్వలేదు. లైట్ తీసుకుంది. నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదని టాస్కుని తీసి పారేసింది. బ్యాడ్ కెప్టెన్ అవ్వడం కంటే.. కెప్టెన్ అవ్వకుండా ఉంటేనే బెటర్ అంటూ ఓ సూక్తి వ్యాఖ్యలు చేసింది. అలా మాటలు చెప్పడమే తప్పా.. చేతల్లో మాత్రం శ్రీ సత్య శూన్యంగా ఉన్నట్టు కనిపిస్తోంది. మరి ఇలాంటి సత్య ఎన్ని రోజులు ఇంట్లో ఉంటుందో చూడాలి.
Yamadonga : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్‌గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…
School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…
Thotakura Vajresh Yadav : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమివ్వనున్న కీలక కార్యక్రమం ఆదివారం జరగనుంది. మల్కాజిగిరి…
Bandi Ramesh : కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్‌లో ఉన్న ఓల్డ్ బాలాజీ నగర్ హౌసింగ్ బోర్డ్…
Talari Ambrose in Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన…
Redmi Turbo 5 : భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన లాంచ్‌కు రంగం సిద్ధమైంది. బడ్జెట్ ధరలో ప్రీమియం…
Modi Cabinet TDP : దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన…
Telangana Students : తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో ప్రభుత్వం కీలక మార్పులకు…
Peddi Movie Day 2 Box Office Collections : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ…
This website uses cookies.