Home » Entertainment » Srinidhi Shetty Heroine Craze In Big
Entertainment

Srinidhi Shetty : కేజీఎఫ్ హీరోయిన్ క్రేజ్ ఇంతుందా..?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: July 13, 2022 9:26 pm
Advertisement

Srinidhi Shetty : ఒకే ఒక్క సినిమా ఓవర్ నైట్ హీరోహీరోయిన్‌లను, దర్శకుడిని స్టార్స్‌గా నిలబెడుతుంది. అదే సినిమా వారికి విపరీతమైన ఫ్యాన్స్ బేస్‌ని భారీ రెమ్యునరేషన్ అందుకునేలాగా చేస్తుంది. అయితే, దాన్ని నిలబెట్టుకోవడం మాత్రం చాలా కష్టం. కానీ, అదెవరూ ఇప్పటి హీరోయిన్స్ పాటించడం లేదు. చాలా తక్కువమందే ఎక్కువకాలం ఇండస్ట్రీలోనే కొనసాగాలనుకుంటున్నారు. అది దృష్ఠిలో పెట్టుకొనే తరువాత సినిమాలను ఆచితూచి ఎంచుకుంటున్నారు. మేకర్స్‌ను దృష్ఠిని పెట్టుకొని రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం చేయడం లేదు.

Advertisement

అయితే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకే కొందరు మాత్రం వచ్చిన అవకాశాన్ని చూసి అందులో హీరో ఎవరు ..ఏ రేంజ్ సినిమా..నిర్మాణ సంస్థ ఏదీ అనేవి ఆలోచించి రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మరో రకం ఉంది. ఒక హీరోయిన్ నటించిన సినిమాలు వరుసగా హిట్ అవుతుంటే లక్కీ హీరోయిన్‌గా పరిగణలోకి తీసుకొని వారే భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారు. అలా ఇప్పుడు కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న శ్రీనిధి శెట్టికి సాలీడ్ ఆఫర్ ఇచ్చారు. తమిళంలో చియాన్ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా కోబ్రా. దీనిలో విక్రమ్ పలు గెటప్పులలో కనిపించబోతున్నారు.

Srinidhi Shetty heroine craze in big

Advertisement

Srinidhi Setty : శ్రీనిధి శెట్టి రెమ్యునరేషన్ గురించే హాట్ టాపిక్..!

ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. అయితే, కోబ్రా సినిమా ద్వారా శ్రీనిధి శెట్టి తమిళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది. అయినా కూడా కేజీఎఫ్ సిరీస్ చిత్రాల సక్సెస్‌ను దృష్ఠిలో పెట్టుకొనే దాదాపు 7 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట. చెప్పాలంటే ఇండస్ట్రీకొచ్చిన ఇంత తక్కువ సమయంలో ఒక హీరోయిన్ ఈ రేంజ్ రెమ్యునరేషన్ అందుకుంటుందంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. అది కూడా విక్రమ్ లాంటి అగ్ర హీరో..పాన్ ఇండియా సినిమా కాబట్టి అంత భారీ రెమ్యునరేషన్ అమ్మడికి ముట్టచెప్పినట్టు కోలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో శ్రీనిధి శెట్టి రెమ్యునరేషన్ గురించే హాట్ టాపిక్ అవుతోంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి