Home » Entertainment » Srinu Vaitla Break Up News Viral
Entertainment

Srinu Vaitla : మ‌రో బ్రేక‌ప్.. త‌న భార్య‌కి విడాకులు ఇచ్చేందుకు సిద్ధ‌మైన శ్రీను వైట్ల‌.. !

Authored By
Sam C
The Telugu News | Published on: July 17, 2022, 2:30 pm
Advertisement

Srinu Vaitla : టాలీవుడ్‌లో ఇటీవ‌ల బ్రేక‌ప్స్ గురించి అనేక వార్త‌లు వింటున్నాం. అన్యోన్యంగా ఉన్న జంట‌లు కూడా ప‌లు కార‌ణాల వ‌ల‌న విడాకులు తీసుకుంటున్నారు. స‌మంత‌- నాగ చైత‌న్య డైవ‌ర్స్ త‌ర్వాత చాలా మంది విడాకులు తీసుకొని అంద‌రిని ఆశ్చ‌ర్య‌పరిచారు. ఇక ఇప్పుడు శ్రీను వైట్ల‌- రూప వైట్ల విడాకుల వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారింది. వీళ్లు విడాకులకు కూడా అప్లై చేశారట. ప్రాసెస్ పెండింగ్ లో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అభిప్రాయ బేధాల వ‌ల‌న‌నే ఈ ఇద్ద‌రు విడాక‌లు తీసుకునేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని టాక్. ఈ విషయమై నిజమేమిటో తెలియాల్సి ఉంది.

Advertisement

రవితేజ కెరీర్ స్టార్టింగ్ లో నటించిన సినిమా ‘నీకోసం’ నుండి మొన్న వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ వరకు వరుస విజయాలతో..కొన్ని ఫ్లాప్ లతో నెట్టుకొచ్చిన శ్రీను వైట్ల మంచు విష్ణు తో ఢీ సినిమాకి సీక్వెల్ తీయ్యబోతున్నారు. సక్సెస్ ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న ఈయన తన భార్యకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడిన్నట్లు వార్తలు వైరల్ కావ‌డం అభిమానుల‌ని క‌ల‌వ‌ర ప‌రుస్తుంది. ఆమె నాంపల్లి కోర్టులో ఈ మేరకు డైవర్స్ కు ఫైల్ చేసారని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

srinu vaitla break up news viral

Advertisement

Srinu Vaitla : నిజ‌మెంత‌?

రూపా వైట్ల ‘వేదిక్’ అనే బ్రాండ్ ద్వారా వ్యవసాయాధారిత సేంద్రీయ ఉత్పత్తుల వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ బ్రాండ్ ద్వారా తొలిత ఆవు పాలను విక్రయించనున్నట్లు ప్రకటనలో తెలిపారు. వివిధ కంపెనీలకు చెందిన విదేశీ బ్రాండ్‌లు చాలా అందుబాటులో ఉన్నప్పటికీ ఆర్గానిక్ ప్రొడక్ట్‌లకు డిమాండ్ చాలా ఉండటంతో ఈ రంగం వైపు మొగ్గుచూపారు. ”ఇది ఓ విధానం కాదు.. విప్లవం” అంటూ వేదిక్ బ్రాండ్‌తో మార్కెట్‌లో తొలి అగుడు వేసారు ఆమె. మ‌రోవైపు శ్రీను వైట్ల మంచి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని త‌పన ప‌డుతున్నాడు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి