Star Heroine Lavanya Tripati Marriage Rumours With Varun Tej
Heroine : మెగా హీరో వరుణ్ తేజ్ స్టార్ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరి పెళ్లికి ఇంట్లో వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.మెగా ఫ్యామిలీలో రాంచరణ్ తర్వాత ఇప్పటికీ ఎవరి మ్యారేజ్ కాలేదు.ఇటీవల నాగబాబు తన గారాల పట్టి నిహారిక కొణిదెల మ్యారేజ్‌ను అంగరంగ వైభవంగా జరిపించారు. అనంతరం వరుణ్ తేజ్ మ్యారేజ్ కూడా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ పెళ్లికి సంబంధించి ఎలాంటి విషయం బయటకు రాలేదు. తాజాగా వరుణ్ టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్నాడని, వీరి విషయం ఇంట్లో కూడా తెలియడంతో వారు కూడా వివాహానికి ఓకే చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి సీక్రెట్‌గానే కాకుండా అప్పుడప్పుడు పార్టీలలో కూడా ఒకే దగ్గర కనిపిస్తూ అందరిలో అనుమానాలు పెంచేస్తున్నారు. అలాగే లావణ్య పుట్టిన రోజున వరుణ్ తేజ్ రూ.1 కోటి విలువ చేసే డైమండ్ రింగ్‌తో ప్రపోజ్ చేయడానికి ఆమె దగ్గరికి వెళ్ళాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఈ వార్తలపై ఎవరూ స్పందించలేదు.లావణ్య త్రిపాఠి ఇప్పటికే వరుణ్ తేజ్ ఫ్యామిలీలో కలిసిపోయింది. నిహారిక పెళ్లికి సినీ పరిశ్రమ నుంచి చాలా తక్కువ మందికి ఆహ్వానం వచ్చింది.కానీ అందులో లావణ్య త్రిపాఠి కూడా పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Star Heroine Lavanya Tripati Marriage Rumours With Varun Tej
దీంతో వీరి మధ్య ప్రేమ ఉందనేది వాస్తవమని అంతా అనుకుంటున్నారు. అలాగే నిహారిక పెళ్లి టైంలో తన చెల్లెలిని పెళ్లి కూతురు చేయడం దగ్గర నుంచి ప్రతి ఒక్క పనిలో లావణ్యత్రిపాఠి కూడా పాల్గొందని సమాచారం. వరుణ్ తేజ్ తల్లి పద్మజకు కూడా లావణ్య త్రిపాఠి చాలా నచ్చిందని టాక్ వినిపిస్తోంది. అలాగే కొడుకు ప్రేమ విషయంలో పద్మజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, లావణ్య కూడా తనకు బాగా నచ్చిందని.. ఆమెను ఇంటి కోడలిగా చేసుకోవడానికి ఏ మాత్రం అభ్యంతరం లేదని చెప్పినట్టు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.కాగా, దీనికి సంబంధించి అటు లావణ్య కానీ,మెగా ఫ్యామిలీ గానీ ఇంతవరకు స్పందించలేదు.
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
This website uses cookies.