Home » Entertainment » Star Maa Plans Sunday Afternoon Slot For Comedy Show
Entertainment

Star Maa : ఆ ప్లాన్‌తో అంతా ఖతం.. ఆ షోలతో స్టార్ మా దెబ్బ అదుర్స్

Authored By
Cinema Desk
The Telugu News | Published on: January 24, 2021, 10:10 pm
Advertisement

Star Maaస్టార్ మా ప్రస్తుతం వినోదం అందించడంలో అన్ని చానెళ్లు పోటీ పడుతున్నాయి. బుల్లితెర స్థాయి కూడా పెరిగింది. వాటికి తగ్గట్టే అన్నీ ప్రసార చానెళ్లు కొత్త కొత్త షోలను తీసుకువస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులకు బుల్లితెరపై వినోదాన్ని అందించాలంటే మాత్రం అది ఈటీవీ తరువాతే. మల్లెమాల యూనిట్ సరికొత్త షోలతో ముందుకు వస్తుంటుంది. ఇప్పటికే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ, పటాస్ వంటి షోలతో తమ సత్తా చాటుకుంది.

Advertisement

Star Maa Plans Sunday Afternoon Slot For Comedy show

ఇక ఈటీవీకి, అందులోని షోలకు పోటీగా ఇంత వరకు ఇతర షోలు నిలబడలేదు. జీ తెలుగు ఆల్రెడీ చేతులు కాల్చుకుంది. అదిరింది, బొమ్మ అదిరింది… మొత్తానికి బెదిరిపోయింది. అలా స్టార్ మా వాడే అంతో ఇంతో పోటీగా నిలబడతాడు. స్టార్ మా ప్రసారం చేసే బిగ్ బాస్ షో ఒక్కటే అన్నింటి కంటే క్లిక్ అవుతుంది. కానీ అది మహా అంటే నాలుగు నెలలుంటుంది. కానీ ఆ తరువాత స్టార్ మాకు వినోదాన్ని పంచే సపరేట్ షోలు లేవు.

Advertisement

బిగ్ బాస్ కంటెస్టెంట్లతో కామెడీ స్టార్స్ షో : Star Maa

అందుకే ఈ సారి మాత్రం గట్టిగా పోటి ఇచ్చేందుకువచ్చారు. డ్యాన్స్ ప్లస్ షోతో ఢీ ని ఢీకొట్టేందుకు వచ్చారు. ఇక సుమ చేత స్టార్ట్ మ్యూజిక్అనే షోనుప్రారంభించాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్లతో కామెడీ స్టార్స్ షోను ప్రారంభించాడు. ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటలకు వరకు తమ చానెల్‌కు అతుక్కుపోయేలా ఈ రెండు షోలను ప్రారంభించాడు. ఈ విషయం తెలిసీ ఈటీవీలో శ్రీదేవీ డ్రామా కంపెనీ అనే కొత్త షోను కూడా అదే సమయానికి ప్రసారం చేస్తున్నారు. మరి ఈ రెండు షోల్లో ఏది క్లిక్ అవుతుందో చూడాలి.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి