Home » Entertainment » Sudigali Sudheer Clarity On Rashmi Gautam Secret Marriage
Entertainment

Sudigali Sudheer : నాకు సుడీగాలి సుధీర్‌కు ఎలాంటి సంబంధం లేదు.. సీక్రెట్ పెళ్లిపై రష్మీ గౌతమ్ క్లారిటీ!

Authored By
mallesh
The Telugu News | Published on: January 31, 2022, 5:00 pm
Advertisement

Rashmi Gautam : జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి తెలియని వారుండరు. కొత్తగా పరిచయం కూడా అవసరం లేదనుకుంట. ఈ మధ్యకాలంలో జబర్దస్త్ కమెడియన్ సుడీగాలి సుధీర్‌కు రష్మీకి మధ్య ఏదో ఉందని, వీరిద్దరూ లవ్‌లో ఉన్నాయని జోరుగా వార్తలు వస్తున్నాయి. దీనికితోడు తాజాగా రష్మీ కరోనా లాక్‌డౌన్ టైంలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ వింటూ, చూస్తూ జనాలు పిచ్చోళ్లు అవ్వడమే కాకుండా ఆ వార్తలను షేర్ చేసి పిచ్చోళ్లను చేస్తున్నారు. అది నిజమని నమ్మి మోసపోతున్నారు.

Advertisement

ఆ తర్వాత నిజం తెలుసుకుని మండిపడుతున్నారు.ఇన్నాళ్లుగా వస్తున్న పుకార్లకు యాంకర్ రష్మీ ఎట్టకేలకు ఫుట్‌స్టాప్ పెట్టింది. సుడీగాలి సుధీర్ యాంకర్ రష్మీ ఇద్దరూ కలిసి ఒకే షోలో చేస్తున్నారు. అంతేకాకుండా ఢీ డ్యాన్స్ ప్రొగ్రామ్స్‌లో కూడా చేస్తున్నారు. సుధీర్ స్కిట్ చేసే టైంలో రష్మీకి లైన్ వేయడం, కామెంట్స్ చేయడం ఇవన్నీ చూసి వీరిమధ్య ఏదో ఉందని అంతా అనుకుంటున్నారు. దీంతో జోరుగా పుకార్లు చెలరేగాయి. అప్పట్లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు స్కిట్ కూడా చేశారు. అది చూసి రష్మీకి సుధీర్‌కు వివాహం జరిగిందని అంతా భావించారు.

Sudigali Sudheer clarity on Rashmi Gautam secret marriage

Advertisement

Sudigali Sudheer : సుధీర్ రిలేషన్‌పై కుండబద్దలు కొట్టిన రష్మీ..

కానీ అది టీఆర్పీ రేటింగ్స్ కోసం చేసిన స్కిట్ అని తెలిసి అంతా షాకయ్యారు.ఎట్టకేలకు ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు సుధీర్ కు మధ్య ఉన్న రిలేషన్ పై క్లారిటీ ఇచ్చింది. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని.. అంతకు మించి మా ఇద్దరి మధ్య ఏమీ లేదని, రిలేషన్ అస్సలు లేదని తేల్చిచెప్పింది. ఇక సీక్రెట్ వివాహంపై స్పందించిన రష్మీ అవన్నీ పుకార్లు మాతమ్రే అని తేల్చిచెప్పింది. వాటిని నమ్మవద్దని కుండబద్దలు కొట్టింది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి