Home » Entertainment » Sudigali Sudheer Comedy Show In Star Maa Tv Again
Entertainment

Sudigali Sudheer : సుధీర్ కామెడీ ని మళ్లీ తప్పుగా వాడుకోబోతున్న స్టార్‌ మా… పాపం సుధీర్‌ అన్న బలి అవుతున్నాడు !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: February 8, 2023, 8:17 pm
Advertisement

Sudigali Sudheer : జబర్దస్త్ కార్యక్రమంలో ఉన్నన్ని రోజులు సుడిగాలి సుధీర్ బుల్లి తెర సూపర్‌ స్టార్ అనడంలో సందేహం లేదు. ఎప్పుడైతే ఈటీవీ, మల్లెమాల నుండి తప్పుకున్నాడో అప్పటి నుండి సుడిగాలి సుధీర్ అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. గతంలో హీరోగా వరుసగా ఆఫర్స్‌ దక్కేవి. కానీ ఇప్పుడు జబర్దస్త్ లో లేని కారణంగా ఆయనను ఫిలిం మేకర్స్ పట్టించుకోవడం లేదు. ఒకటి రెండు సినిమాలు చేసినా కూడా అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ అవ్వక పోవడంతో హీరోగా సినిమాల్లో ఆఫర్లు రావడం లేదు. మరో వైపు బుల్లి తెరపై కూడా పెద్దగా సందడి చేసే అవకాశం దొరకడం లేదు.

Advertisement

sudigali sudheer comedy show in star maa tv again

దాంతో సుడిగాలి సుధీర్ అత్యంత గడ్డి పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు అంటూ ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు సూపర్ స్టార్ ఇమేజ్ తో బుల్లి తెరపై వెలుగు వెలిగిన సుధీర్ ఇప్పుడు చిన్న చిన్న పాత్రలు చేస్తూ చిన్న చిన్న షో లు చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నాడు. గతంలో స్టార్‌ మా లో చేసిన కొన్ని కార్యక్రమాలు నిరాశ పర్చడంతో ఆహా ఓటీపీకి సుడిగాలి సుధీర్ వెళ్లి పోయిన విషయం తెలిసిందే. అక్కడ కామెడీ స్టాక్ ఎక్సేంజ్‌ కార్యక్రమం పూర్తయింది. దాంతో మళ్లీ స్టార్ మా వారి నుండి సుధీర్ పిలుపు అందుకున్నాడు.

Advertisement

sudigali sudheer comedy show in star maa tv again

ఒక కార్యక్రమం కోసం సుధీర్ ని స్టార్ మా వారు వాడుకోబోతున్నారు. గతంలో మాదిరిగా బుల్లి తెర సూపర్‌ స్టార్ అన్నంత ఇమేజ్ రాకున్నా కూడా ఏదో ఒకలాగా ప్రేక్షకుల ముందు ఉండవచ్చు అనే ఉద్దేశంతోనే సుధీర్ ఈ కార్యక్రమాన్ని కమిట్ అయి ఉంటాడు అంటూ ఆయన అభిమానులు అభిప్రాయం అర్థం చేస్తున్నారు. బుల్లి తెరపై మళ్ళీ సుదీర్ తన యొక్క సత్తా చాటాలి అంటే ఈటీవీ లోనే సాధ్యం అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈటీవీ వారు సుధీర్ ని వెనక్కి రానిస్తారా అంటే అనుమానమే.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి