Home » Entertainment » Sudigali Sudheer Marriage Still In Suspense
Entertainment

Sudigali Sudheer : శ్రీదేవి డ్రామా కంపెనీ వేదిక‌గా సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రివీల్ అయింది..!

Authored By
Sam C
The Telugu News | Published on: April 7, 2022, 9:30 pm
Advertisement

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్.. బుల్లితెర సూప‌ర్ స్టార్‌గా మారాడు. అతి త‌క్కువ స‌మ‌యంలో మంచి క్రేజ్ సంపాదించిన సుడిగాలి సుధీర్ పెళ్లి విష‌యం ఎప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. జబర్దస్త్ షోతో సుడిగాలి సుధీర్‌గా ఎదురులేని స్టార్డంను సొంతం చేసుకున్నాడు. అయితే సుధీర్ పేరు వినిపిస్తే.. ఆ తరువాత కచ్చితంగా రష్మీ పేరు ఉండాల్సిందే. అలా సుధీర్ రష్మీ జోడి గత తొమ్మిదేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూనే వస్తోంది. సుధీర్ రష్మీ పెళ్లి మీద చేసిన ఈవెంట్లు ఎన్నో సూపర్ హిట్లు అయ్యాయి. సుధీర్ రష్మీ పెళ్లి మీద ఈవెంట్లు చేయడం

Advertisement

ఆ ఇద్దరి మధ్య ఏదో ఉందని క్రియేట్ చేస్తూ ప్రేక్ష‌కుల‌లో ఆస‌క్తిని క‌లిగించారు.ఎన్ని కొత్త జంట‌లు వ‌చ్చిన కూడా సుధీర్, ర‌ష్మీ జంట‌కి ఉన్న క్రేజ్ వేరు. అయితే చాలా రోజుల త‌ర్వాత సుధీర్ పెళ్లి చేశారు. ఇటీవ‌ల సుధీర్‌కు పెళ్లి జరుగుతున్నట్టు, ఎంగేజ్మెంట్ అయినట్టుగా ఓ ప్రోమోను వదిలి సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. స్కిట్ లో భాగంగా సుడిగాలి సుధీర్ అందమైన నలుగురు అమ్మాయిలను పెళ్లి చూపులు చూసి.. వారిలో ఒకరైన తేజస్వి నాయుడుని పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి చూపుల నేపథ్యంలో ఒకొక్క అమ్మాయి ఒక్కొక్క విధంగా సుధీర్ ను పొగిడి ఆకట్టుకున్నారు.

Sudigali Sudheer marriage still in suspense

Advertisement

Sudigali Sudheer : సుధీర్ పెళ్లిపై ఫుల్ క్రేజ్.

షోలో ఓ రేంజ్ లో సందడి చేశారు. ముఖ్యంగా సుధీర్ నలుగురు అమ్మాయిలతో కలిసి చేసిన డ్యాన్స్ ప్రేక్షకులను అలరించింది.ఇక తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో మా నాన్న‌కు పెళ్లి అంటూ పలు స్కిట్స్ చేశారు. ఇందులో ఒక్కొక్క‌రు త‌మ ప‌ర్‌ఫార్మెన్స్ తో అద‌ర‌గొట్టారు. చివ‌ర‌కు ఓ ముస‌లాయ‌న అంద‌రు నీ పెళ్లి గురించి అడ‌గుతున్నార‌ని చెప్ప‌గా,దానికి స్పందించిన సుడిగాలి సుధీర్ అంత‌రు అడుగుతున్నారు కాబ‌ట్టి నేను చేసుకోబోయే అమ్మాయి ఎవ‌రంటే అంటూ సస్పెన్స్ లో పెట్టారు. ఇది కూడా ప్రమోష‌న్ లో భాగ‌మ‌ని తెలుస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి