Home » Entertainment » Sudigali Sudheer Out In Jabardasth Show
Entertainment

Sudheer : జబర్దస్త్ షో నుంచి సుధీర్ తప్పుకున్నాడా? అసలు ఇంతకీ ఏం జరిగింది?

Authored By
mallesh
The Telugu News | Published on: November 14, 2021, 1:10 pm
Advertisement

Sudheer : జబర్దస్త్ అంటే సుడిగాలి సుధీర్.. సుడిగాలి సుధీర్ అంటే జబర్దస్ అనేలా షో మారిపపోయింది. అసలు సుధీర్ లేకుండా జబర్దస్ షోను ఊహించుకోవడం చాలా కష్టం. అటువంటిది సుధీర్ ఈ షో నుంచి బయటకు వెళ్లాడనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అసలు ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందనే విషయం కాసేపు పక్కకు పెడితే అసలు సుధీర్ లేకుండా జబర్దస్త్ షోను ఊహించుకోవడం చాలా కష్టం.

Advertisement

చిన్న కమెడియన్ గా జీవితం మొదలు పెట్టిన సుధీర్ అనతి కాలంలోనే పెద్ద కమెడియన్ గా మారిపోయాడు. ఎంతలా అంటే సుధీర్ స్మాల్ స్ర్కీన్ పవర్ స్టార్ లా ఎదిగిపోయాడు. అంతలా స్టార్ డమ్ ను పెంచుకున్న సుధీర్ కు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. దీంతో జబర్దస్త్ పోగ్రాం కోసం అతడు సరిగ్గా డేట్లను అడ్జెస్ట్ చేయలేకపోతున్నాడని తెలుస్తోంది.

Sudigali Sudheer Out in jabardasth Show

Advertisement

Sudheer : డేట్ల‌ను అడ్జ‌స్ట్ చేయ‌లేక‌పోతున్నాడా..

ఫలితంగా మల్లెమాల సంస్థ ప్రతి సంవత్సరం తన కమెడియన్లతో చేయించే అగ్రిమెంట్ ను ఈ ఏడాది సుధీర్ చేయలేదనే ప్రచారం జోరుగా జరుగుతోంది. డేట్లు అడ్జెస్ట్ కాకే సుధీర్ అగ్రిమెంట్ మీద సైన్ చేయలేదా? లేకపోతే వేరే ఏదైనా కారణం ఉందా అనే విషయం మాత్రం సరిగ్గా తెలియడం లేదు.ఈ విషయంలో సుడిగాలి సుధీర్ నుంచి స్పష్టమైన ప్రకటన వస్తే గానీ ఈ విషయం గురించి క్లారిటీ రాదు.

సుధీర్ వెళ్లిపోవడంతో ఆయన టీం మెంబర్స్ అయిన ఆటో రాంప్రసాద్ కానీ సూపర్ శ్రీను కానీ జబర్దస్త్ టీం లీడర్లు అవుతారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సుధీర్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా అతడు ఏ చానల్ కు వెళ్లినా కానీ రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారు. అదీ కాకుండా సుధీర్ కు సినిమాల్లో కూడా పలు ఆఫర్లు వస్తున్నాయి. దీంతో సుధీర్ జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీద మల్లెమాల యాజమాన్యం కానీ సుధీర్ కానీ ఎటువంటి అఫిషియల్ ప్రకటన చేయలేదు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి