Sudigali Sudheer punches on Rashmi Gautam
Sudigali Sudheer : బుల్లితెరపై క్యూట్ జోడీ అంటే ఠక్కున గుర్తొచ్చేది సుధీర్- రష్మీ జంట. వీరిద్దరు ఏ షోలో ఉన్నా అది సూపర్ హిట్టే. కొన్నాళ్లుగా కలిసి చేయని సుధీర్ -రష్మీ జంట రీసెంట్‌గా మా టీవీ షోలో కనిపించారు. వీరిద్దరిని జంటగా చూసిన వారు ఆశ్చర్యపోయారు. ఈ ఇద్దరు జోడి సూపర్ హిట్ అని కామెంట్ చేశారు. మెజీషియన్‌గా కెరీర్‌ను ఆరంభించిన సుధీర్.. ఎన్నో చానెళ్లలో స్పెషల్ షో లు చేస్తూ బుల్లితెరపై సందడి చేశారు. ఇలాంటి సమయంలో జబర్దస్త్ కమెడియన్ల దృష్టిలో పడటంతో అందులో ఆర్టిస్టుగా అడుగు పెట్టారు. అలా పరిచయం అయిన చాలా తక్కువ సమయంలో తన టాలెంట్ నిరూపించుకున్నాడు. దీంతో షో నిర్వహకులు అతడికి టీమ్ లీడర్‌గా ప్రమోషన్ కూడా కల్పించారు.
సుధీర్ రష్మీల మీద గతంలో చేసిన ఎన్నో ఈవెంట్లు బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. ఈ ఇద్దరి పెళ్లి మీద చేసిన ఈవెంట్లు అప్పట్లో ఒక సంచలనం. అయితే సుధీర్ రష్మీ జోడిగా కనిపించి చాలా రోజులైంది. ఈ ఇద్దరూ కలిసి పండుగ స్పెషల్ ఈవెంట్లు చేయడం లేదు. సుధీర్ ఈటీవీ షోలకు వెళ్తుంటే.. రష్మీ మాత్రం వేరే చోట తిరుగుతుంది. కొంతకాలంగా వీరు షో లో కనిపించడం లేదు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు కారణం అని అనుకున్నారు కానీ అసలు విషయం లేటుగా వెలుగులోకి వచ్చింది. అదేమంటే వీరిద్దరూ మల్లెమాల అగ్రిమెంట్ రద్దు చేసుకొని మరో పాపులర్ ఛానల్ స్టార్ మాలో ఎంట్రీ ఇచ్చారు.,కొత్త ఛానల్ లో అడుగుపెట్టిన ఈ జంట కలిసి ఇప్పుడు హోలీ సెలబ్రేషన్స్ ను మొదలు పెట్టారు.
Sudigali Sudheer punches on Rashmi Gautam
హోలీ సందర్భంగా స్టార్ మా ఛానల్ లో ఓ స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేశారు. దీనికి రవి -రష్మీ హోస్ట్ లుగా వ్యవహరించారు.సుధీర్స స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. అంతేకాదు రష్మీతో చనువుగా ఉంటూ ఆశ్చర్యపోయాడు. సుధీర్-రష్మీ గురించి రవి పలు ప్రశ్నలు వేయగా, దానికి స్టన్నింగ్ సమాధానాలు ఇచ్చారు. తమకు ఓ సారి గొడవ అయిందని, ఇద్దరు రెండు రోజుల పాటు మాట్లాడుకోలేదని రష్మీ చెప్పింది. అయితే తనకు నచ్చిన స్వీట్ పంపించడంతో తిరిగి ఇద్దరం హగ్ చేసుకొని ఏడ్చేశాం అంటూ రష్మీ చెప్పింది. ఛాన్స్ ఇస్తే రష్మీ..సుధీర్ కి ఏం ఇవ్వాలని అనుకుంటుంది అనగా, కెమెరా ముందు ఇచ్చేదా అని అంటాడు. ఇక ఆడుదామా అంటే లైట్స్ ఆఫ్ అంటాడు. ఈ సమయంలో కూడా మంచి ఫన్ జనరేట్ అయింది. మొత్తానికి హోలీ ఎపిసోడ్ కేక పుట్టించేలా ఉంది.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.