Sudigali Sudheer Rashmi Gautam appears in maa tv event
Sudigali Sudheer : వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉంటాయి. అలాంటి సూపర్ హిట్ కాంబినేషన్స్‌లో సుడిగాలి సుధీర్,రష్మీ జంట ఒకటని చెప్పాలి. సుడిగాలి సుధీర్ రష్మీ జోడికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గత తొమ్మిదేళ్లుగా ఈ జంట ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అయితే స్పెషల్ ఈవెంట్లలో మాత్రం ఈ మధ్య కనిపించడం లేదు. ఇక ఢీ షోలోనే ఈ ఇద్దరూ జంటగా కనిపించేవారు. ఇప్పుడేమో అది కూడా సాధ్యపడటం లేదు. సుడిగాలి సుధీర్ రష్మీల మీద గతంలో చేసిన ఎన్నో ఈవెంట్లు బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. ఈ ఇద్దరి పెళ్లి మీద చేసిన ఈవెంట్లు అప్పట్లో ఒక సంచలనం. వీరిద్దరితో ఏదైన షో ప్లాన్ చేయండని నిర్వాహకులని కూడా కోరుతున్నారు అభిమానులు. ఈ క్రమంలో మాటీవీ వీరిద్దరిని ఒకే ఫ్రేములో చూపించి ఆనందపరిచింది.
మరి కొద్ది రోజులలో హోళీ వేడుక కానుండగా, ఇందుకు సంబంధించి స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేసింది మల్లెమాల. రంగ్ దే అంటూ వచ్చిన ఈ ఈవెంట్‌లో సుధీర్ కనిపించలేదు. ఎప్పటిలానే ఆది, రాం ప్రసాద్, ఇమాన్యుయేల్, వర్షలే కనిపించారు. సుధీర్ ఎక్కడా? అంటూ అతని ఫ్యాన్స్ కామెంట్లతో మల్లెమాల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే అనుకోకుండా మనోడు మాటీవీ స్పెషల్ షోలో ప్రత్యక్షం అయి ఆశ్చర్యపరిచాడు. తగ్గేదేలే అంటూ యాంకర్ రవి, రష్మీ హోస్ట్ చేస్తోన్న ఈ షోలో సుధీర్ కనిపించాడు. రష్మీ కోసం సుధీర్ పాట పాడటం, రష్మీ దిష్టి చుక్క పెట్టేయడం అందరిని తెగ ఆకట్టుకుంది.
Sudigali Sudheer Rashmi Gautam appears in maa tv event
మొదటి సారిగా స్టార్ మా ఈవెంట్ లో సుధీర్ కనిపించడంతో ఈ విషయం గురించి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.సుధీర్.. మల్లెమాలకి బ్రేకప్ చెప్పాడా, లేదంటే కేవలం గెస్ట్ అప్పియరెన్స్ గానే మా టీవీ షోలో సందడి చేశాడా అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే బుల్లితెరపై సుడిగాలి సుధీర్ అంటే వెంటనే గుర్తుకొచ్చే మరో పేరు రష్మి గౌతమ్. ఎందుకంటే ఇద్దరూ ఇద్దరే.. ఈ ఇద్దరూ అలా కనిపిస్తుంటే చూసే వాళ్లకు కన్నుల పండగే. అంత బాగా సెట్ అయిపోయారు ఈ జోడీ. అందుకే నిర్వాహకులు కూడా వాళ్లతోనే ఎక్కువగా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తుంటారు. చేసిన ప్రోగ్రామ్స్‌కు ప్రోమోలను సైతం రష్మి, సుడిగాలి సుధీర్పై కట్ చేస్తుంటారు.
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
This website uses cookies.