Home » Entertainment » Sudigali Sudheer Re Entry In Mallemala And Jabardasth Show
Entertainment

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ను మల్లెమాల పూర్తిగా దూరం పెట్టలేదు.. జబర్దస్త్‌ డోర్లు సుధీర్‌ కి ఓపెన్‌గా ఉన్నాయా?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 12, 2022, 7:40 pm
Advertisement

Sudigali Sudheer : జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సుడిగాలి సుధీర్ కి ఏ స్థాయిలో గుర్తింపు వచ్చిందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో యంగ్ స్టార్ హీరోల స్థాయిలో సుడిగాలి సుదీర్ ని తెలుగు ప్రేక్షకులు అభిమానిస్తారు. ఒకానొక సందర్భంగా ఆయనను అంతకు మించి అభిమానించిన ప్రేక్షకులు కూడా ఉన్నారు అనడంలో సందేహం లేదు. జబర్దస్త్ కార్యక్రమంలో సుడిగాలి సుదీర్ జర్నీ సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తోంది. ఇటీవల వరుసగా సినిమాల్లో నటిస్తున్న కారణంగా తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని చేయలేను అంటూ దూరమైన విషయం తెలిసిందే. సినిమాల పేరు చెప్పి స్టార్ మా లో సుడిగాలి సుదీర్ జాయిన్ అయ్యాడు.

Advertisement

అక్కడ నుండి తిరిగి జబర్దస్త్ కార్యక్రమానికి సుడిగాలి సుదీర్ వచ్చేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే స్టార్ మా లో కామెడీ స్టార్స్ కార్యక్రమాన్ని మూసి వేశారు. దాంతో ఆహా ఓటీటీ లో కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనే కామెడీ షో చేసేందుకు రెడీ అయ్యాడు. అనిల్ రావిపూడి తో కలిసి ఈ కామెడీ షో నిర్వహిస్తున్న సుడిగాలి సుదీర్ త్వరలోనే జబర్దస్త్ కార్యక్రమానికి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ బుల్లి తెర వర్గాల వారు అభిప్రాయం చేస్తున్నారు. తాజాగా గాలోడు సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా జబర్దస్త్ కార్యక్రమం లో సుడిగాలి సుదీర్ చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సందర్భంగా స్కిట్ చేయడంతో పాటు యాంకర్ రష్మి గౌతమ్ తో రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ కూడా చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

Sudigali Sudheer re entry in mallemala and jabardasth show

Advertisement

సాధారణంగా ఒకసారి జబర్దస్త్ నుండి వెళ్లి పోయిన వారికి మరెప్పుడూ కూడా రీఎంట్రీ ఉండదు. కానీ సినిమా పేరు చెప్పి మల్లెమాల వారితో ఒప్పందం చేసుకొని జబర్దస్త్‌ స్టేజిపై సుడిగాలి సుదీర్ సందడి చేశాడు. ఇలాగే ముందు ముందు కూడా సుడిగాలి సుదీర్ జబర్దస్త్ స్టేజీపై కనిపించే అవకాశం ఉందని అతనికున్న స్టాండర్డ్ నేపథ్యంలో జబర్దస్త్ డోర్లు ఎప్పుడూ కూడా సుడిగాలి సుధీర్ కి ఓపెన్ చేసి ఉంటాయి అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. అతి త్వరలోనే సుడిగాలి సుదీర్ ఫుల్ టైం కమెడియన్ గా ఈటీవీ జబర్దస్త్ లో కనిపించాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మల్లెమాల వారు కూడా అందుకు ఓకే అన్నట్లుగానే ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి ఏం జరగబోతుందో చూడాలి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి