Sudigali Sudheerఈటీవీ తాను కూర్చున్న చెట్టును తానే నరుకున్నట్లుగా వ్యవహరిస్తుంది అంటూ విమర్శలు వస్తున్నాయి. ఈటీవీని సుదీర్ఘ కాలంలో టాప్ రేటింగ్ లో నెం.2 లేదా నెం.3 గా ఉంచిన షో లు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షో లు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ నాలుగు షో లు మొత్తం వారం లో పదే పదే ఈటీవీ టెలికాస్ట్ చేస్తూ మంచి రేటింగ్ ను దక్కించుకుంటుంది. అలాంటి జబర్దస్త్ నుండి సుడిగాలి సుధీర్ ను తప్పించడం ఎంత పెద్ద తప్పిదమో వారికి ఇప్పటికే అర్థం అయ్యింది. హైపర్ ఆది కంటే కూడా అధికంగా సుడిగాలి సుధీర్ కు క్రేజ్ ఉంది. ఆయన పారితోషికం విషయంలో కూడా పెద్దగా మల్లెమాల వారిని, ఈటీవీ వారిని ఇబ్బంది పెట్టలేదు.
అయినా కూడా పొమ్మనలేక పొగబెట్టినట్లుగా శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు జబర్దస్త్ నుండి పంపించారు. అంతకు ముందు ఢీ నుండి కూడా సుధీర్ ను పంపించేసిన విషయం తెల్సిందే. సుధీర్ కు వారు ఇచ్చేది తక్కువ పారితోషికం అయినా కూడా తనకు లైఫ్ ఇచ్చిన ఛానల్ అన్నట్లుగా సుధీర్ ఇన్నాళ్లు ఉన్నాడు. కాని ఇప్పుడు ఆయన స్టార్ మా లో జాయిన్ అయ్యాడు. మొన్నటి వరకు శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకర్ గా వ్యవహరించిన సుధీర్ ఇప్పుడు ఆ షో కు పోటీ అన్నట్లుగా మొదలు అయిన పార్టీ లేదా పుష్ప కు యాంకరింగ్ చేస్తున్నాడు. శ్రీదేవి డ్రామా కంపెనీలో చేస్తున్న సమయంలో ఒక్క షెడ్యూల్ కు 6 నుండి 7 లక్షల పారితోషికం ఇచ్చే వారు.
షో నుండి బయటకు వస్తున్న సమయంలో సుధీర్ కు 9 నుండి 10 లక్షల వరకు పారితోషికం ఇచ్చారు అనేది సమాచారం. ఇప్పుడు స్టార్ మా వారు ఒక్క షెడ్యూల్ కు ఏకంగా రూ.15 లక్షల పారితోషికం.. అంటే రెట్టింపు పారితోషికం స్టార్ మా వారు ఇస్తున్నారు. ఎప్పటి నుండో రెట్టింపు పారితోషికం ఆఫర్ చేస్తున్నా కూడా సుడిగాలి సుధీర్ మాత్రం పెద్దగా స్పందించలేదు. మల్లెమాల మరియు ఈటీవీ పై ఉన్న అభిమానంతో ఉండి పోయాడు. కాని ఇప్పుడు వారే పొమ్మన్నారు.. దాంతో సుధీర్ నవ్వుతూ బయటకు వచ్చేశాడు.. ఇప్పుడు స్టార్ మా లో కుమ్మేయడానికి సిద్దం అయ్యాడు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.