
sunanda and kannababu give shock to jnanamba in janaki kalaganaledu
Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 30 మే 2022, ఎపిసోడ్ 311 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎలాగైనా రామా, జానకిని పెళ్లికి పంపించేందుకు జ్ఞానాంబను ఒప్పించాలని తెగ ప్రయత్నిస్తుంటాడు గోవిందరాజు. ఇంతలో అటుకుల చిట్టిబాబు రామాకు ఫోన్ చేసి జ్ఞానాంబతో మాట్లాడాలంటాడు. అమ్మా.. జ్ఞానాంబ గారు అనుకోకుండా పెళ్లి క్యాన్సిల్ అయిందమ్మా అంటాడు. దీంతో అరె అవునా అంటుంది. అవును అమ్మా. స్వీట్లు క్యాన్సిల్ చేద్దామని ఫోన్ చేశాను. మళ్లీ ముహూర్తం అనుకోగానే ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు చిట్టిబాబు. ఏమైంది జ్ఞానం అని అడుగుతాడు గోవిందరాజు. దీంతో పెళ్లి వాయిదా పడిందని చెప్పాడు అంటుంది జ్ఞానాంబ.
sunanda and kannababu give shock to jnanamba in janaki kalaganaledu
దీంతో గోవిందరాజు సంతోషిస్తాడు. కానీ.. అయ్యయ్యో అవునా.. పాపం. సర్లే.. ఆ దేవుడు నిర్ణయించిన దానికి మనమేం చేస్తాం. రాముడు.. ఇక నువ్వు స్వీట్లు తయారు చేసే పని లేదు కదా. నువ్వు అమ్మాయి.. రేపు పెళ్లికి వెళ్లండి అని చెప్తాడు. దీంతో సరే అంటాడు రామా. ఇంతలో తన లక్ష రూపాయలు పోలేరమ్మ నుంచి తీసుకోవాలని అనుకొని.. వెంటనే తన దగ్గరికి వెళ్లి అత్తయ్య గారు అంటుంది. ఆ లక్ష రూపాయలు ఇస్తే వెళ్లి ఆ చిట్టిబాబుకు ఇస్తాను అంటుంది మల్లిక. జ్ఞానాంబ గారు అంటే ఎవరు అని అడిగితే.. నేనే ఇంట్లో ఉన్నారు అని చెప్పాను అంటుంది. అతడు మళ్లీ ముహూర్తం పెట్టుకున్నప్పుడు చెప్తా అన్నాడు. లేదంటే అతడే వచ్చి తీసుకెళ్తాడులే అని చెప్పి అక్కడి నుంచి జ్ఞానాంబ వెళ్లిపోతుంది.
మరోవైపు ఎలాగైనా తన భర్త ఫోన్ తీసుకొని అందులోని తన వీడియో డిలీట్ చేయాలని అనుకుంటుంది మల్లిక. విష్ణు నిద్రపోతున్నప్పుడు.. తన ఫోన్ కోసం వెతుకుతుంది. కానీ.. తన ఫోన్ దొరకదు. ఇంతలో విష్ణు లేస్తాడు. ఏమైంది అని అడుగుతాడు. నా ఫోన్ కోసం వెతుకుతావని తెలిసే నేను ఆ ఫోన్ ను నీ దిండు కింద పెట్టా అని షాకిస్తాడు.
మరోవైపు రామా, జానకి హైదరాబాద్ వెళ్లడానికి టికెట్స్ తీశా అని చెబుతాడు గోవిందరాజు. దీంతో సరే అంటారు రామా, జానకి. ఇంతలోనే సునంద, కన్నబాబు ఇద్దరూ స్వీటు బాక్స్, ఇన్విటేషన్ పట్టుకొని జ్ఞానాంబ ఇంటిక వస్తారు. వాళ్లను చూసి జ్ఞానాంబ షాక్ అవుతుంది.
అసలు.. వీళ్లెందుకు వచ్చారు అని అందరూ అనుకుంటారు. స్వీట్ షాప్ ఓపెనింగ్ ఉంది. మీరు తప్పకుండా రావాలి అంటుంది సునంద. షాపు కూడా మీ షాపు పక్కనే ఓపెన్ చేస్తున్నాం అంటుంది. సోమవారం తప్పకుండా మీరు రావాలి అని స్వీట్ బాక్స్ ఇస్తుంది.
మరోవైపు కన్నబాబు అప్పు ఎలా తీర్చాలా అని ఆలోచిస్తుంటారు రామా, జానకి. ఈ డబ్బు సమస్య గురించి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు అని జానకి అంటుండగా.. అప్పుడే గోవిందరాజు వస్తాడు. వాళ్ల మాటలు వింటాడు. హైదరాబాద్ వెళ్తే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కదా అని అంటాడు రామా. వీళ్ల మాటలను మల్లిక చాటుగా వింటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.