Home » Entertainment » Superstar Krishna Last Rites To Be Held In Mahaprasthanam
Entertainment

Superstar Krishna : కృష్ణ భౌతికకాయం ఇంకా కాలకుండానే మహేష్ బాబు ఫ్యామిలీకి మరొక బిగ్ న్యూస్..!!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: November 16, 2022, 12:20 pm
Advertisement

Superstar Krishna : సూపర్ స్టార్ కృష్ణ చనిపోయి కూడా ఒక రోజు అయిపోయింది. ఇంకా ఆయన అంత్యక్రియలు పూర్తి కాలేదు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని సందర్శించేందుకు చాలా మంది అభిమానులు పోతెత్తుతున్నారు. ఆయన్ను చివరి సారి చూడాలని కోరుకుంటున్నారు. అందుకే ఆయన భౌతికకాయాన్ని గచ్చిబౌలి స్టేడియానికి తీసుకెళ్లి అభిమానుల సందర్శనార్థం ఉంచాలని అనుకున్నారు కానీ.. అక్కడ చలిలో కృష్ణ కుటుంబ సభ్యులు ఉండాల్సి వస్తుంది. అభిమానులు, సిబ్బందికి కూడా ఇబ్బంది కలుగుతుందని తెలిసి కృష్ణ ఇంట్లోనే భౌతికకాయాన్ని ఉంచారు. అయితే..

Advertisement

ఇవాళ ఉదయం పద్మాలయ స్టూడియోకు ఆయన భౌతికకాయాన్ని తరలించారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు కృష్ణ భౌతికకాయాన్ని అభిమానుల కోసం పద్మాలయ స్టూడియోలోనే ఉంచారు. ఆ తర్వాత ఆయన అంత్యక్రియలు ప్రారంభం అవుతాయి. మధ్యాహ్నం 12 తర్వాత జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. ఊరేగింపుగా అక్కడి వరకు కృష్ణను తీసుకెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరగనున్నట్టు తెలుస్తోంది. నిజానికి.. ఆయన అంత్యక్రియలను పద్మాలయ స్టూడియో లేదా కృష్ణ ఫాంహౌస్ లో నిర్వహించాలని ముందు కుటుంబ సభ్యులు అనుకున్నారట.

Superstar Krishna last rites to be held in mahaprasthanam

Advertisement

Superstar Krishna : ఇందిరా దేవి అంత్యక్రియలు జరిగిన ప్లేస్ లోనే కృష్ణ అంత్యక్రియలు కూడా

కానీ.. అక్కడ అంత్యక్రియలు నిర్వహించడం సాధ్యపడటం లేదని కృష్ణ కుటుంబ సభ్యులు తెలిపినట్టు సమాచారం. అయితే.. కృష్ణ మొదటి భార్య ఇందిరా దేవి అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలోనే జరిగాయి. అందుకే కృష్ణ అంత్యక్రియలను కూడా అక్కడే మహాప్రస్థానంలో చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారట. అందుకే ఫామ్ హౌస్ లో కానీ.. పద్మాలయా స్టూడియోలో కానీ.. అంత్యక్రియలను నిర్వహించడం లేదు. అక్కడ నిర్వహించకుండా మహాప్రస్థానంలో ఇందిరా దేవికి నిర్వహించిన ప్లేస్ లోనే కృష్ణ అంత్యక్రియలు కూడా జరగనున్నాయి.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి