Home » Entertainment » Superstar Krishna Mahesh Babu Has Bought Most Expensive Things
Entertainment

SuperStar Krishna : మహేష్ బాబు అంటే సూపర్ స్టార్ కృష్ణకి ఎంత ప్రేమో చూడండి.. ఏ తండ్రీ కొనలేనివి కొని ఇచ్చాడు

Authored By
Breaking News 2
The Telugu News | Published on: November 16, 2022, 2:22 pm
Advertisement

SuperStar Krishna : సూపర్ స్టార్ కృష్ణకు తన కొడుకు మహేశ్ బాబు అంటే ఎంతో ప్రాణం. అందుకే తనకు ఎంతో ఇష్టమైన సినిమా రంగానికే తన కొడుకు మహేశ్ ను నటుడిని చేశారు. ప్రస్తుతం మహేశ్ బాబు కూడా టాప్ హీరో. ఒకప్పుడు కృష్ణ సినిమా ఇండస్ట్రీని ఎలా రూల్ చేశారో.. ఇప్పుడు మహేశ్ బాబు కూడా తెలుగు ఇండస్ట్రీని అలా రూల్ చేస్తున్నారు. నెంబర్ వన్ హీరో ఆయన. ఇప్పుడు కాదు.. గత 20 ఏళ్ల నుంచి మహేశ్ బాబు తెలుగు ఇండస్ట్రీని రూల్ చేస్తున్నారు. ఆయన సినిమాల్లో చాలా సినిమాలు బాక్సాఫీసును బద్దలు కొట్టాయి. బ్లాక్ బస్టర్ హిట్లుగా చాలా సినిమాలు నిలిచాయి.

Advertisement

కేవలం సినిమాలు మాత్రమే కాదు.. పలు బ్రాండ్స్ కు అంబాసిడర్ గానూ మహేశ్ బాబు వ్యవహరించారు. పలు బిజినెస్ వెంచర్లు కూడా మహేశ్ కు ఉన్నాయి. అయితే.. మహేశ్ బాబుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను ఆయన భార్య నమ్రత చూసుకుంటుంది. పెళ్లి తర్వాత నమ్రత సినిమాల్లో నటించలేదు. బిజినెస్ చూసుకుంటూ ఇంటి వద్దే ఉంటున్నారు. అయితే.. మహేశ్ బాబు వద్ద చాలా విలువైన వస్తువులు కొన్ని ఉన్నాయంటే.. వాటిలో కొన్నింటిని తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కొనిచ్చారట. అవేంటో ఇప్పుడు చూద్దాం రండి. మహేశ్ బాబుకు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో పెద్ద బంగ్లా ఉంది. అక్కడే ప్రస్తుతం మహేశ్ బాబు ఉంటున్నారు.

SuperStar Krishna mahesh babu has bought most expensive things

Advertisement

SuperStar Krishna : జూబ్లీహిల్స్ లో పెద్ద బంగ్లా

ఇక.. తనకు షూటింగ్ టైమ్ లో అందుబాటులో ఉండేందుకు వానిటీ వాన్ ను మహేశ్ బాబు కొనుగోలు చేశారు. దాని విలువ సుమారు రూ.6.2 కోట్లు. షూటింగ్ విరామ సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి మహేశ్ బాబు ఆ వ్యాన్ ను ఉపయోగించుకుంటారు. ఇక.. మహేశ్ కు ఏఎంబీ అనే ఒక మాల్ కూడా ఉంది. దాని విలువ సుమారు రూ.80 కోట్లుగా ఉంటుంది. మహేశ్ కు ఉన్న రేంజ్ రోవర్ వోగ్ కారు ధర రూ.4 కోట్లు. దాన్ని తన భార్య నమ్రత తన పుట్టిన రోజు నాడు గిఫ్ట్ గా ఇచ్చారు. అలాగే.. మహేశ్ దగ్గర లంబోర్గిని గల్లార్డో, రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ, ఆడి ఇ ట్రాన్ ఎలక్ట్రిక్ కారు, మెర్సిడిస్ బెంజ్ కార్లు కూడా ఉన్నాయి.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి