Samantha – Naga Chaitanya : సమంత – నాగ చైతన్య విడాకులకి సుప్రియనే అసలు కారణమా?
Samantha – Naga Chaitanya : ఈ ఏడాది అక్టోబర్ 2 వస్తే సమంత – నాగ చైతన్య జంట విడిపోయి ఏడాది అవుతుంది. చూడ చక్కని జంటగా గుర్తింపు తెచ్చుకున్న సమంత – నాగ చైతన్య అనుకోని కారణాల వలన విడిపోయారు. వీరి విడాకుల విషయం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అయితే వీరిరివురు విడిపోయి ఏడాది అవుతున్నా కూడా ఇప్పటికీ ఈ ఇద్దరికి సంబంధించి ఎన్నో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. చైతు – సమంత బ్రేకప్‌లపై రోజుకో కొత్త స్టోరీలు పుట్టుకు వస్తున్నాయి. వారు వీటిని ఖండించకపోవడంతో చాలా ఎక్కువ అయిపోతున్నాయి.
Samantha – Naga Chaitanya : తప్పుడు వార్తలు..
సమంత- చైతు విడిపోవడానికి ఇప్పటికే పలువురు పేర్లు చెప్పుకొచ్చారు. అయితే నాగార్జున మేనకోడలు యార్లగడ్డ సుప్రియ వల్లే చైతు – సమంత బంధం తెగిపోయింది అని కొందరు రాసారు. అసలు సుప్రియకి సమంత- చైతూ విడిపోవడానికి కారణమేంటా అని చూస్తూ.. సుప్రియ యంగ్ హీరో అడవి శేషు ప్రేమించుకున్నారట. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట. అయితే ముందు నుంచి కూడా సుప్రియకు సమంతకు పడదు. ఈ క్రమంలో సమంత.. సుప్రియ పెళ్లి చెడగొట్టిందని, ఆ కోపంతోనే సుప్రియ.. నాగ చైతన్య- సమంత విడాకులకి కారణమైందని కొందరు రాసుకొచ్చారు.
supriya Is The Reason For Samantha Naga Chaitanya Divorce
ఇవన్నీ పనికి రాని వార్తలు అని కొందరు కొట్టిపారేశారు. తప్పుడు వార్తల వలన అనవసరంగా లేని పోని ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారని కొందరు మండిపడుతున్నారు. దీనిపై సుప్రియ ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి. ఇక సుప్రియ విషయానికి వస్తే.. సుప్రియ ముందుగా చరణ్ రెడ్డితో ప్రేమలో పడింది. చరణ్ రెడ్డి ఉషా కిరణ్ మూవీస్ నుంచి వచ్చిన `ఇష్టం` సినిమాలో హీరోగా నటించాడు. అతడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే చరణ్ దురలవాట్లకు లోనవడంతో అతడికి దూరమైంది. తర్వాత చరణ్ మృతి చెందాడు. ఇక చాలా రోజుల తర్వాత సుప్రియ `గూఢచారి` సినిమాతో తెలుగు తెరపై రీఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో వారిద్దరికి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారిందని చెప్పుకొస్తున్నారు
