Home » Entertainment » Surekha Vani Daughter Supritha Gets Trolled By Netizens
Entertainment

Supritha : కూతురికి మందు తాగించిన సురేఖా వాణి.. తిట్టిపోస్తున్న నెటిజ‌న్స్

Authored By
Sam C
The Telugu News | Updated on: August 8, 2022 6:29 pm
Advertisement

Supritha : టాలీవుడ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. సురేఖా వాణి.. తెలుగు సినిమాల్లో తల్లి, కోడలు, భార్య పాత్రల్లో మెరుస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి. సురేఖా వాణి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది.. ముఖ్యంగా బ్రహ్మనందం లాంటీ కమెడీయన్స్ పక్కన నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.త‌న భ‌ర్త త‌ర్వాత సురేఖా వాణి సినిమాల‌కు కాస్త దూర‌మైంది. కేవ‌లం సోష‌ల్ మీడియా ద్వారా ర‌చ్చ చేస్తుంది. కూతురు సుప్రిత‌తో క‌లిసి చేస్తున్న సంద‌డి అంతా ఇంతా కాదు. ఇప్పటివరకు షార్ట్ ఫిలిమ్స్,ప్రైవేట్ ఆల్బమ్స్‌తో పాపులర్‌ అయిన సుప్రిత లేచింది మ‌హిళా లోకం సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇవ్వనుంది.

Advertisement

Supritha : సుప్రిత ర‌చ్చ‌..

కార్తీక్-అర్జున్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుప్రిత మెయిన్‌ లీడ్‌లో నటిస్తుంది. కాగా ఈ సినిమాలో సుప్రీతతో పాటు హరితేజ, హేమ, శ్రద్దాదాస్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే సుప్రిత కూడా సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన లేటెస్ట్ మరియు గ్లామర్ ఫోటోలను సుప్రీత ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ వస్తుంది. ఇక తన ఫ్రెండ్స్‌తో వీడియోలు కూడా అప్పుడప్పుడు అప్ లోడ్ చేస్తుంటుంది సుప్రీత. తాజాగా సుప్రీత బర్త్ డే సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా చేశారు.

Surekha Vani Daughter supritha gets trolled by netizens

Advertisement

సుప్రీత బర్త్‌డే సందర్భంగా తన తల్లితో పాటు తన ఫ్రెండ్స్ అందరూ తన బర్త్ డే సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా సురేఖ వాణి తన కూతురికి మందు తాపించి బర్త్ డే విషెస్ చెప్పింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు ప్రస్తుతం వైరల్ గా అవుతుంది. ఇక నెటిజన్లు దీనిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. త‌ల్లి అయి ఉండి కూతురికి ఇలా మందు తాగిస్తారా అంటూ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. కాగా, సుప్రీత కూడా త్వరలో తల్లిబాటలోనే.. సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని సమాచారం. సుప్రీతను సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా అని ఒక సందర్భంలో సురేఖ వాణిని ప్రశ్నించగా.. అది పూర్తిగా తన కూతురి ఇష్టమని తేల్చి పడేసింది

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి