Home » Entertainment » Surekha Vani Dream Car Pic Goes Viral
Entertainment

Surekha Vani : అదే నా కల అంటూ పోస్ట్.. ఎప్ప‌టికి అయినా ఆ కోరిక తీర్చుకుంటా.. సురేఖా వాణి

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: July 30, 2022 9:14 pm
Advertisement

Surekha Vani : సురేఖా వాణి ప్రస్తుతం బిజీగానే ఉంటోంది. అడపాదడపా చిత్రాల్లో నటిస్తోంది. కానీ తనకంటూ గుర్తింపు తెచ్చే పాత్రలు ఇప్పుడు రావడం లేదు. ఒకప్పుడు సురేఖా వాణి కనిపిస్తే నవ్వులఝల్లు కురిసేది. బ్రహ్మానందం, సురేఖా వాణి కాంబోలో వచ్చిన ఎన్నో సీన్లు అదిరిపోయాయి. అయితే ఇప్పుడు ఆమెకు కాస్త ప్రాధాన్యం తగ్గినట్టు అనిపిస్తోంది. అంతగా చెప్పుకునే కారెక్టర్లు ఏమీ రావడం లేదు. అయినా కూడా వచ్చిన పాత్రలేవో చేసుకుంటూ వెళ్తోంది. కోలీవుడ్, టాలీవుడ్ అంటూ బాగానే బిజీగా ఉంటోంది. మధ్య మధ్యలో వెకేషన్లు వేస్తూ ఎంజాయ్ చేస్తోంది.

Advertisement

తన కూతురు సుప్రితతో కలిసి సురేఖా వాణి వేసే వెకేషన్లు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బ్యాంకాక్ వీధుల్లో, దుబాయ్ హోటల్లో, గోవా బీచుల్లో ఈ ఇద్దరూ చేసే హంగామాకు అందరూ ఫిదా అవుతుంటారు. ఇక ఆ మధ్య బ్యాంకాక్‌లో సురేఖా వాణి బర్త్ డే సెలెబ్రేషన్స్ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. తన అమ్మ నోట్లో షాంపైన్ పోస్తూ సుప్రిత పోజులు ఇచ్చింది. అలా మొత్తానికి ఈ తల్లీకూతుళ్లు చేసిన హంగామా మామూలుగా లేదు. అయితే సురేఖా వాణి తాజాగా తన కూతురి ప్రైవేట్ ఆల్బమ్‌ను ప్రమోట్ చేస్తోంది. యాడ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ అంటూ సుప్రిత ఫేమస్ అవ్వడం మొదలుపెట్టేసింది.

Surekha vani Dream car Pic Goes Viral

Advertisement

ఇక మున్ముందు త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి. ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలైనట్టు కనిపిస్తోంది. అయితే సురేఖా వాణి ప్రస్తుత స్టేటస్ బాగానే ఉంది. మరీ అంత రిచ్ కాకపోయినా కూడా బాగానే సంపాదించేస్తోంది. అయితే తన డ్రీమ్ కార్ అంటూ తాజాగా సురేఖా వాణి తన మనసులోని కోరిక బయటపెట్టేసింది. రేంజ్ రోవర్ కారు అనేది తన డ్రీమ్ కారు అని చెప్పుకొచ్చింది. అంటే ఎప్పటికైనా సురేఖా వాణి ఆ కారును కొనేస్తుందన్న మాట. మొత్తానికి ఈ కారుల సోకు, వెకేషన్ల సోకులు సురేఖా వాణి, సుప్రితలకు బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది. మరి ఆ కారును సురేఖా వాణి ఎప్పుడు కొంటుందో చూడాలి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి