Home » Entertainment » Suspense Over Varanasi Movie Part Titles
Entertainment

Varanasi Movie : ‘వారణాసి’పై సస్పెన్స్.. రెండు పార్ట్స్ టైటిల్స్ ఇవేనా..!

Authored By
Suma
The Telugu News | Published on: January 31, 2026, 6:00 pm
Advertisement

Varanasi Movie  : ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేమికులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రాజెక్ట్ ‘వారణాసి Varanasi ’. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి SS Rajamouli , Mahesh babu  సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ డ్రామా ప్రతి చిన్న అప్డేట్‌తోనే పాన్ వరల్డ్ లెవెల్‌లో చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే సినిమా స్కేల్, బడ్జెట్, టెక్నికల్ టీమ్ విషయాల్లో భారీ అంచనాలు ఏర్పడగా ఇప్పుడు పార్ట్ టైటిల్స్‌పై వస్తున్న వార్తలు సస్పెన్స్‌ను మరింత పెంచుతున్నాయి.

Advertisement

Varanasi Movie : ‘వారణాసి’పై సస్పెన్స్.. రెండు పార్ట్స్ టైటిల్స్ ఇవేనా..!

Varanasi : రెండు భాగాలుగా ‘వారణాసి’… నిజమేనా?

ఇటీవల మేకర్స్ గ్రాండ్‌గా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. రాజమౌళి గత చిత్రాల ట్రెండ్‌ని గమనిస్తే కథ డిమాండ్ చేస్తే పార్ట్‌లుగా తీసుకెళ్లడంలో ఆయన వెనకాడరు. ‘వారణాసి’ కథ కూడా గ్లోబల్ లెవెల్ కాన్సెప్ట్‌తో పాటు టైమ్ స్పేస్ అంశాల చుట్టూ తిరుగుతుందనే టాక్ ఉండటంతో, రెండు భాగాలుగా రావడం సబబేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Advertisement

Varanasi : ‘గ్లోబ్ ట్రాటర్’, ‘టైమ్ ట్రాటర్’ టైటిల్స్‌పై చర్చ

తాజా సమాచారం ప్రకారం పార్ట్ 1కి ‘వారణాసి: గ్లోబ్ ట్రాటర్’, పార్ట్ 2కి ‘వారణాసి: టైమ్ ట్రాటర్’ అనే టైటిల్స్ లాక్ అయ్యాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆసక్తికరంగా ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్‌లో మాత్రం ‘గ్లోబ్ ట్రాటర్’ అనే పదమే హైలైట్ అయ్యింది. అయితే మొదట విడుదలైన టైటిల్ గ్లింప్స్‌లో రెండు పేర్లు కనిపించాయనే వాదన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. అసలు ఇవి పార్ట్ టైటిల్సా? లేక కథలోని కాన్సెప్ట్‌ని సూచించే ట్యాగ్‌లైన్సా? అనే డౌట్ అభిమానుల్లో మొదలైంది.

Varanasi : అధికారిక క్లారిటీ కోసం ఎదురుచూపులు

ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రాజమౌళి టీమ్ సాధారణంగా పూర్తి క్లారిటీ ఉన్నప్పుడే అప్డేట్స్ ఇస్తుంది కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం అంతా గాసిప్స్‌గానే పరిగణించాల్సి ఉంటుంది. అయితే టైటిల్స్‌లోని ‘గ్లోబ్’ మరియు ‘టైమ్’ వంటి పదాలు సినిమా కథ పరిధిని ఎంత విస్తృతంగా ఉండబోతోందో సూచిస్తున్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యంత డిఫరెంట్ పాత్రగా ఇది నిలవబోతోందన్న టాక్ కూడా అంచనాలను ఆకాశానికి ఎత్తేస్తోంది. ‘వారణాసి’ పార్ట్ టైటిల్స్‌పై కొనసాగుతున్న ఈ సస్పెన్స్ ఎప్పుడు తెరపడుతుందో చూడాలి. అప్పటివరకు ప్రతి చిన్న లీక్, పోస్టర్, గ్లింప్స్ అభిమానులకు పండగే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి