Tammareddy Bharadwaj : ఆస్కార్ కోసం రాజమౌళి ఖర్చుపై తమ్మారెడ్డి భరద్వాజ కాంట్రవర్సీ కామెంట్స్..వీడియో వైరల్!!
Tammareddy Bharadwaj : ప్రపంచ సినిమా రంగంలో ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ అని అందరికీ తెలుసు. సినిమా రంగానికి సంబంధించి ఎవరైనా ఈ అవార్డు గెలిస్తే అతని పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రొగుతుంటది. అటువంటి అవార్డుకు రాజమౌళి “RRR” సెలెక్ట్ కావడం తెలిసిందే. ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో నాటు నాటు సాంగ్ పోటీ పడుతూ ఉంది. ఇదే కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం జరిగింది. దీంతో కచ్చితంగా ఆస్కార్ “RRR” గెలుచుకునే పరిస్థితి ఉందని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.
Tammareddy Bharadwaj Comments On RRR Team About Oscars Award
ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రమోషన్ కార్యక్రమాలకు ఫ్లైట్ చార్జీలకే దాదాపు 80 కోట్లకు పైగా రాజమౌళి టీం ఖర్చు చేయడం జరిగింది…అని తమ్మారెడ్డి భరద్వాజ్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. “RRR”.. 500 మరియు 600 కోట్లు ఖర్చుపెట్టి సినిమా నిర్మించారు. ఇప్పుడు ఆస్కార్ అవార్డు ప్రమోషన్ కార్యక్రమాలు కోసం భారీ ఎత్తున ఖర్చు చేస్తూ ఫ్లైట్ల మీద తిరుగుతున్నారు. అవే ఫ్లైట్ ఖర్చులు మాకిస్తే 8, 10 సినిమాలు తీసి వాళ్ళ మొహం మీద కొడతాం అని అన్నారు.
Tammareddy Bharadwaj Comments On RRR Team About Oscars Award
దీంతో తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. హైదరాబాద్ రవీంద్ర భారతి కార్యాలయంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం ఈనెల 13వ తారీకు జరగనుంది. ఈ సమయంలో “RRR” ఆస్కార్ గెలవాలని సినిమా ప్రేమికులు కోరుకుంటున్నారు. “RRR” ఆస్కార్ గెలిస్తే తెలుగు చలనచిత్ర పరిశ్రమ యొక్క పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమొగుతుందని చెప్పుకొస్తున్నారు.
