Home » Entertainment » Tarun Clarity On Marriage
Entertainment

Tarun : మెగా ఇంటి అమ్మాయితో తరుణ్ పెళ్లి వార్త అంతా ఫేక్ అని తేలిపోయింది..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: August 2, 2023 10:03 pm
Advertisement

Tarun : హీరో తరుణ్ తల్లి రోజా రమ్మని ఇటీవల తన కొడుకుకి త్వరలో పెళ్లి చేయబోతున్నట్లు ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. ఇండస్ట్రీలో పేరుగాంచిన కుటుంబానికి చెందిన అమ్మాయితో వివాహం జరగనున్నట్లు స్పష్టం చేశారు. అయితే పెళ్లికూతురు ఎవ్వరు అన్నది మాత్రం చెప్పలేదు. దీంతో తరుణ్ పెళ్లి పై ఊహాజనిత వార్తలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మెగా కుటుంబానికి చెందిన వారితో…పెళ్లి జరగనున్నట్లు ఇటీవల ప్రచారం కూడా జరిగింది. అయితే వచ్చిన వార్తలలో వాస్తవం లేదని తేలిపోయింది.

Advertisement

మెగా కుటుంబానికి చెందిన వారితో పెళ్లి అని అనటానికి కూడా పొంతన లేదు. ఎందుకంటే తరుణ్ వయసు చాలా ఎక్కువ. ఇది కేవలం దుష్ప్రచారం మాత్రమేనని తాజా వార్త ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. తరుణ్ ఒకప్పుడు తెలుగు చలనచిత్ర రంగంలో లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో. కానీ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లు పడటంతో.. కొన్నాళ్లు అవకాశాలు తగ్గటంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. హీరోలకు అవకాశాలు తగ్గిన తర్వాత తరుణ్ వాళ్ళు వ్యాపారాలు చేసినట్లు వార్తలు వచ్చాయి.

Tarun clarity on marriage

Advertisement

అయితే ప్రస్తుతం తరుణ్ తోటి హీరోలు మళ్లీ రీఎంట్రీ ఇస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. దీంతో తరుణ్ మళ్లీ ఇప్పుడు రీఎంట్రీ ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తరుణ్ పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలు ఇండస్ట్రీలో అదేవిధంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి