Home » Entertainment » Tarun Marriage With Lovely Girl
Entertainment

Tarun : తరుణ్ పెళ్ళి.. లవర్ బాయ్‌కి లవ్లీ అమ్మాయి దొరికింది.

Authored By
vamana sai
The Telugu News | Updated on: May 11, 2021 3:57 pm
Advertisement

Tarun : తరుణ్.. చైల్డ్ ఆర్టిస్ట్‌గానే మంచి పేరు తెచ్చుకున్నాడు. తల్లి రోజా రమణి హీరోయిన్‌గా డబ్బింగ్ ఆర్టిస్టుగా పాపులర్ కావడంతో తరుణ్ హీరో అవడానికి పెద్దగా కష్ట పడలేదు. నువ్వే కావాలి సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చి భారీ హిట్ అందుకున్నాడు. హీరోగా మొదటి సినిమానే రామోజీ ఫిలింస్ లాంటి పెద్ద సంస్థ, విజయ్ భాస్కర్ లాంటి పెద్ద డైరెక్టర్, మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ కథ మాటలు.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి సంగీతం.. ఇలా తరుణ్ మొదటి సినిమాకే పెద్ద క్రూతో పనిచేశాడు.

Advertisement

tarun-marriage with lovely girl

దాంతో ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. లవర్ బాయ్ ఇమేజ్‌తో లవ్ స్టోరీస్ చేసి పెద్ద హీరోల లిస్ట్ లో చేరాడు. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థలలో తరుణ్ సినిమాలు వచ్చాయి. కొన్నేళ్ళు తరుణ్ హవా టాలీవుడ్‌లో పతాక స్థాయిలో కొనసాగింది. తరుణ్ లాంటి ఇమేజ్ మరే హీరోకి రాదని అందరూ చెప్పుకున్నారు. దాంతో తరుణ్ కూడా ఇక తనని కొట్టే యంగ్ హీరో ఇప్పట్లో రాడని ధీమాగా ఉన్నాడు. కానీ ఉదయ్ కిరణ్ లాంటి యంగ్ హీరోలతో పాటు మెగా ఫ్యామిలీ హీరోలు వచ్చి గట్టి పోటీ ఇచ్చారు.

Advertisement

Tarun : తరుణ్ పెళ్ళి ఈ ఏడాదే జరగబోతోందని సమాచారం.

tarun-marriage with lovely girl

అదే సమయంలో తరుణ్ సినిమాలు వరసగా ఫ్లాపవడంతో పాటు ఒక యంగ్ హీరోయిన్‌తో ఎఫైర్ ఉందంటూ వార్తలు రావడం కెరీర్ మీద గట్టి ప్రభావం పడింది. నెమ్మదిగా సినిమాలు లేకుండా పోయాయి. మధ్యలో ఒక సినిమా వచ్చినా అది ఎవరికీ గుర్తు కూడా లేదు. ప్రస్తుతం బిజినెస్ చూసుకుంటున్న ఈ లవర్ బాయ్ త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నాడని.. తన తల్లికి బాగా సన్నిహితురాలైన వారి అమ్మాయిని చేసుకునేందుకు తరుణ్ ఓకే చెప్పాడని తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఈ ఏడాదే తరుణ్ పెళ్ళి జరగబోతోందని సమాచారం.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి