Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ చరిత్రలోనే ఈ సీజన్ సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తోంది. అసలు.. మిగితా సీజన్లను ఎవ్వరైనా గుర్తు పెట్టుకుంటారో లేదో తెలియదు కానీ.. ఈ సీజన్ ను అయితే అందరూ గుర్తు పెట్టుకుంటారు. బిగ్ బాస్ సీజన్ 7 చరిత్రలో నిలిచిపోతుంది. దానికి కారణం.. బిగ్ బాస్ ఉల్టా పుల్టా టాస్కులు. బిగ్ బాస్ ఎప్పుడు ఏం చేసేది ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. ఇక.. నాలుగో వారం ఎలిమినేషన్స్ కూడా టైమ్ దగ్గర పడింది. ఈనేపథ్యంలో నామినేషన్లలో ఉన్న వారిలో ఈ సారి ఇద్దరు ఎలిమినేట్ కాబోతున్నారట. నామినేషన్లలో ఉన్న ఆరుగురిలో ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెబుతున్నారు. అంతే కాదు.. ఇవాళ నాగార్జున ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఒకరికి రెడ్ కార్డు చూపించబోతున్నాడట. అంటే.. ఈసారి వెళ్లిపోతే ముగ్గురు లేదా ఇద్దరు ఖచ్చితంగా ఇంటి నుంచి వెళ్లిపోయే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
మొన్న లాఫింగ్ టాస్క్ లో టేస్టీ టేజా.. గౌతమ్ పై ఫిజికల్ గా దాడి చేశాడు. బెల్ట్ తో మెడ మీద తీవ్రంగా గుంజి గాయపరిచాడు. అలా మూడు నాలుగు సార్లు చేశాడు తేజ. దీంతో ఇంటి సభ్యులు కూడా షాక్ అయ్యారు. అసలు.. ఎవ్వరిపై కూడా ఫిజికల్ గా బిగ్ బాస్ హౌస్ లో వెళ్లకూడదు. కానీ.. టేస్టీ తేజా గౌతమ్ పై ఫిజికల్ గా వెళ్లాడు. దాని వల్ల.. నాగార్జున.. టేస్టీ తేజాకు రెడ్ కార్డు చూపించి హౌస్ నుంచి బయటికి పంపించే అవకాశం ఉంది. అదంతా పక్కన పెడితే.. ఈ వారం నామినేషన్లలో ఉన్న వారిలో ప్రిన్స్ యావర్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయట. ఆ తర్వాత గౌతమ్, ప్రియాంకకు పడ్డాయట. చివరి మూడు స్థానాల్లో శుభశ్రీ, తేజ, రతిక ఉన్నారట.
బిగ్ బాస్ ఇంట్లో నాలుగో ఇంటి సభ్యుడిగా ఉండేందుకు శుభశ్రీకి ఒక చాన్స్ వచ్చింది కానీ.. దాన్ని వాడుకోలేకపోయింది. తను నాలుగో పవరాస్త్ర టాస్క్ లో ఓడిపోయి ప్రశాంత్ గెలిచిన విషయం తెలిసిందే. ఈసారి తనకు చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. అందరికంటే తక్కువ ఓట్లు రతికకు రాగా.. తేజ చివరి నుంచి రెండో స్థానంలో, శుభశ్రీ మూడో స్థానంలో నిలిచినట్టు తెలుస్తోంది. అంటే.. టేస్టీ తేజాను రెడ్ కార్డు ద్వారా పంపిస్తే.. ఆ తర్వాత చివరి రెండు స్థానాల్లో ఉన్న రతిక, శుభశ్రీ ఇద్దరిని కూడా ఈసారి డబుల్ ఎలిమినేట్ చేసే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.