
teja and shobha shetty fight in cube puzzle task in bigg boss 7
Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో మొత్తం మూడు జంటలు ఉండేవి. ఒక జంట మొదట్లోనే విడిపోయింది. ప్రశాంత్, రతిక జంట ఫస్ట్ వీక్ లోనే విడిపోయింది. ఆ తర్వాత రెండో జంట గౌతమ్, శుభశ్రీ. ఈ జంట కూడా చూడటానికి బాగుండేది. కానీ.. శుభశ్రీ ఎలిమినేట్ అవడంతో ఆ జంట కూడా ఫేడవుట్ అయిపోయింది. అయితే.. అస్సలూ ఊహించని విధంగా శోభా శెట్టి, తేజా మధ్య ప్రేమ పుట్టింది. ఇద్దరి మధ్య స్నేహానికి మించిన బంధం ఇంకేదో ఉండేది. అందుకే ఇద్దరూ బిగ్ బాస్ హౌస్ లో చాలా అన్యోన్యంగా ఉన్నారు. ఎవరూ లేనప్పుడు ఇద్దరూ రొమాన్స్ కూడా చేసుకుంటారు. ఐలవ్యూ అంటూ ఒకసారి శోభాకు డైరెక్ట్ గా చెప్పేశాడు తేజ. దీంతో తూ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది శోభ. శోభా టాటూ వేసుకోవాలని బిగ్ బాస్ కూడా తేజపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆమె ఓకే అని చెబితే నేను వెంటనే వేసుకుంటా అని చెప్పేశాడు తేజ. దీంతో నాకు ఓకే.. వేసుకో అని డైరెక్ట్ గా శోభా చెప్పింది అంటే.. తేజ మీద ప్రేమ ఉంటేనే కదా.
కానీ.. తాజాగా క్యూబ్ పజిల్ టాస్క్ లో రచ్చ రచ్చ జరిగింది. ఎప్పుడూ భోలే మీద ఎగిరి పడే శోభా శెట్టి.. తాజాగా తేజపై ఎగిరిపడింది. రతికతో శోభా గురించి ఏదో అన్నాడని శోభా సీరియస్ అయింది. నేను విన్నాను తేజ అంటూ నోరునెత్తిన పెట్టుకుంది శోభా. దీంతో ఏ పోవే అవతలికి అంటూ సీరియస్ అయ్యాడు తేజ. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు తేజ. దీంతో నీకు దమ్ముంటే ఇక్కడికి వచ్చి మాట్లాడు అంటూ సీరియస్ అయింది శోభా. పర్సనల్ గా ఫీల్ అయ్యాడు కాబట్టే అన్నాడు అంటూ శోభా విరుచుకుపడింది. సంబంధం లేకుండా అరుస్తావు ప్రతి దానికి అంటూ తేజ కూడా ఘాటుగానే తనపై స్పందించాడు. భయంతో ఎందుకు పారిపోతున్నావు. ఇక్కడికి వచ్చి మాట్లాడు అంటూ సీరియస్ అవుతుంది శోభా శెట్టి. దీంతో నాకు అవసరం లేదు అంటూ వెళ్లిపోతాడు. ఏం లేని దాన్ని పెద్దది చేయమాకు నువ్వు అంటే.. రా మరి ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతుంది శోభా శెట్టి.
teja and shobha shetty fight in cube puzzle task in bigg boss 7
ఏందన్నా ఇది.. నేను ఏదో రతికతో సరదాగా అంటే ఇలా నామీద విరుచుకుపడుతోంది ఏంటి అంటూ రచ్చ రచ్చ చేస్తాడు తేజ. దీంతో అతి సర్వత్ర వర్జయేత్.. ఏది ఎక్కువైనా ఇలాగే ఉంటది. వదిలేసేయండి.. అంటూ శివాజీ చెబుతాడు. ఏది ఏమైనా.. హౌస్ లో శోభాశెట్టి అరాచకాలు మాత్రం చాలా ఎక్కువైపోయాయి. తనను ఈ వారం ఎలిమినేట్ చేస్తే ఒక దరిద్రం వదిలిపోతుంది అని బిగ్ బాస్ అభిమానులు కుండబద్ధలు కొడుతున్నారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.