Bigg Boss 10 Telugu : రూ. 600 జీతం నుంచి బిగ్ బాస్ హౌస్‌కు.. టెంపర్ వంశీ ఎమోషనల్ జర్నీ..!
Bigg Boss 10 Telugu : స్టార్ మా వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 (Bigg Boss Telugu 10) అప్పుడే ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సీజన్‌లో హౌస్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లలో టెంపర్ వంశీ ప్రయాణం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జూనియర్ ఆర్టిస్ట్‌గా కేవలం రూ. 600 తొలి పారితోషికంతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన వంశీ.. నేడు తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వడం వెనుక ఎంతో కష్టం, పోరాటం దాగి ఉన్నాయి. బిగ్‌బాస్ వేదికపై ప్రదర్శించిన తన ఏవీ (ఆడియో విజువల్) ద్వారా గతాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన పంచుకున్న విషయాలు ప్రేక్షకులను ఎమోషనల్‌కు గురిచేశాయి. అమీర్‌పేటలో కోచింగ్ తీసుకుంటున్నానని ఇంట్లో అబద్ధం చెప్పి, ఫోటోలు పట్టుకుని కృష్ణానగర్, ఫిల్మ్ నగర్‌లోని సినిమా ఆఫీసుల చుట్టూ అవకాశాల కోసం చెప్పులరిగేలా తిరిగిన రోజులను వంశీ గుర్తు చేసుకున్నాడు.
Bigg Boss 10 Telugu : రూ. 600 జీతం నుంచి బిగ్ బాస్ హౌస్‌కు.. టెంపర్ వంశీ ఎమోషనల్ జర్నీ..!
Bigg Boss 10 Telugu ‘టెంపర్’తో మారిన తలరాత.. టాలీవుడ్‌లో వరుస అవకాశాలు
ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘టెంపర్’ వంశీ కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ తమ్ముడిగా, కరుడుగట్టిన విలన్‌గా అద్భుతంగా నటించి మెప్పించడంతో ఆయనకు ‘టెంపర్ వంశీ’ అనే పేరు స్థిరపడిపోయింది. ఆ ఒక్క సినిమా తెచ్చిపెట్టిన గుర్తింపుతో టాలీవుడ్‌లో విలన్‌గా వరుస ఆఫర్లు క్యూకట్టాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’, ‘వకీల్ సాబ్’, మహేష్ బాబు ‘భరత్ అనే నేను’, ప్రభాస్ ‘సాహో’, నితిన్ ‘భీష్మ’, అడివి శేష్ ‘హిట్ 2’, ఎన్టీఆర్ ‘దేవర’ లాంటి ఎన్నో పాన్ ఇండియా, సూపర్ హిట్ సినిమాల్లో తనదైన నెగెటివ్ షేడ్స్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఈ ఏడాది పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో పాటు వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘కొరియన్ కనకరాజు’ చిత్రాల్లోనూ వంశీ కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం.
బిగ్ బాస్ వేదికపై డ్యాన్స్‌తో అదరగొట్టిన వంశీ
ఎన్నో సినిమాల్లో తన కరకు విలనిజంతో భయపెట్టిన వంశీ.. బిగ్ బాస్ స్టేజ్‌పై మాత్రం తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున హిట్ పాటలకు అదిరిపోయే స్టెప్పులేసి హోస్ట్ నాగార్జునను సైతం ఫిదా చేశాడు. వెండితెరపై తన సీరియస్ నటనతో ఆకట్టుకున్న ఈ నటుడు, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో రియల్ క్యారెక్టర్‌తో ప్రేక్షకులకు ఎంతగా కనెక్ట్ అవుతాడన్నది ఆసక్తికరంగా మారింది. ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే నేపథ్యం ఉన్న టెంపర్ వంశీ.. హౌస్‌లో టాస్కులు, ఎమోషన్స్, స్ట్రాటజీలతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో వేచి చూడాలి.
