Home » Entertainment » Thaman Back To Back Mega Family
Entertainment

Thaman : మెగా హీరోలందరినీ థమన్ ఇప్పట్లో వదిలేలా లేడు..!

Authored By
vamana sai
The Telugu News | Published on: April 4, 2021, 6:01 am
Advertisement

Thaman : సినిమా ఇండస్ట్రీలో ఎవరు సక్సస్ లో ఉంటే వాళ్ళ చుట్టే అందరూ ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇక్కడ సక్సస్ మాత్రమే చూస్తారు. క్రేజ్ ఉన్న వాళ్ళని నెత్తిమీద పెట్టుకుంటారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ని టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అందరూ ఎంతో గొప్పగా చూస్తున్నారు. థమన్ చేతి నిండా సినిమాలతో ఊపిరి తీసుకోనంత బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న చాలా సినిమాలకి థమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. నాని లాంటి యంగ్ హీరో నుంచి మెగాస్టార్ వరకు థమన్ అందరినీ రౌండౌప్ చేస్తున్నాడు.

Advertisement

ఇదంతా గత ఏడాది వచ్చిన అల వైకుంఠపురములో సినిమా మహిమ అని చెప్పాలి. ఈ సినిమాకి థమన్ ఇచ్చిన ఆల్బం మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ వ్యూస్ ని దక్కించుకొని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. దాంతో టాలీవుడ్ లో నిర్మిస్తున్న పెద్ద సినిమాలన్ని థమన్ చేతికే వస్తున్నాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలే థమన్ ఎక్కువగా చేస్తున్నాడు. ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో వకీల్ సాబ్ సినిమాకి ప్రమోషన్స్ నిర్వహిస్తున్నాడు. చెప్పాలంటే వకీల్ సాబ్ సినిమా విషయంలో థమన్ చాలా సమయం కేటాయిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి థమన్ ఇచ్చిన సాంగ్స్.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి ప్రశంసలు అందుకుంటున్నాడు.

thaman Back to back Mega Family

Advertisement

Thaman : థమన్ కూడా కాస్త హింట్ ఇచ్చాడట.

కాగా థమన్ చేతిలో ఎక్కువగా మెగా హీరోల సినిమాలుండటం విశేషం. మెగా స్టార్ నటించబోతున్న కొత్త సినిమాకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ అయ్యాడు. అలాగే పవర్ స్టార్ – రానా నటిస్తున్న సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ థమనే. ఇక శంకర్ – మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియన్ సినిమాకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ అని టాక్ వినిపిస్తోంది. థమన్ కూడా కాస్త హింట్ ఇచ్చాడట. ఇవి కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాటకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి