
Thandel Movie Box Office collections : తండేల్ తొలి రోజు కలెక్షన్స్ అదిరిపోయాయిగా... ఎంత వసూళ్లు వచ్చాయంటే..!
Thandel Movie Box Office collections : అక్కినేని akkineni naga chaitanya అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తండేల్ Thandel Moive అయితే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ అయింది. 100 కోట్లతో రూపొందిన ఈ చిత్రం 500 కోట్లు పక్కా వసూలు చేస్తుందని అభిమానులు చెబుతున్నారు.సినిమాలోని మ్యూజిక్, చైతన్య, పల్లవి లవ్ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. పాజిటివ్ రెస్పాన్స్ తో ఓపెనింగ్ డే నుంచే మంచి వసూళ్లను ఖాతాలో వేసుకుంటోంది. భారతదేశంలోని అన్ని భాషలలో కలిపి మొదటి రోజు రూ. 10 కోట్ల మార్కును దాటింది. Sacnilk ప్రకారం, తెలుగులో 9.5 కోట్లు, హిందీలో 15 లక్షలు, తమిళంలో 5 లక్షలు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు వసూళ్లు దాదాపు రూ.16 కోట్లకు చేరుకోవచ్చని ట్రేడ్ వర్గాలు సూచిస్తున్నాయి…
Thandel Movie Box Office collections : తండేల్ తొలి రోజు కలెక్షన్స్ అదిరిపోయాయిగా… ఎంత వసూళ్లు వచ్చాయంటే..!
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ‘తండేల్’ Thandel Movie జోరు బాగా కొనసాగుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో దాదాపు రూ. 27.50 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్ సేల్ జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. తెలుగులో కూడా మొదటి రోజు ఆక్యుపెన్సీ బాగానే ఉంది. ఉదయం షోస్ లో 47.04% ఆక్యుపెన్సీని, మధ్యాహ్నం 44.76%, సాయంత్రం 51.40%, రాత్రి 71.10%కి వరకు ఆక్యుపెన్సీ పెరిగింది. మొత్తం తొలి రోజు 53.58%. ఆక్యుపెన్సీని సాధించింది. ప్రముఖ ఆన్లైన్ టికెట్ బుకింగ్ యాప్ ‘బుక్‌మై షో’లోనూ ‘తండేల్’ Thandel రికార్డు సృష్టించింది. 24 గంటల్లో దాదాపు 2 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయని, అంతేకాకుండా ఈ సినిమా ఇప్పటికీ ట్రెండింగ్‌లో కొనసాగుతున్నట్లు ఆ సంస్థ తాజాగా తెలిపింది.
ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద తొలి రోజు ఈ చిత్రం భారీ కలెక్షన్లు సాధించింది. అక్కడ మొదటి రోజు ఈ చిత్రం సుమారు 3 లక్షల 50వేల డాలర్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని నిర్మాణ సంస్థ తాజాగా ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. దానికి ‘అలలు మరింత బలపడుతున్నాయి’ అనే క్యాప్షన్‌ను జోడించింది. ఇక ఇది చూసి ఫ్యాన్స్ త్వరలోనే ఈ చిత్రం హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేస్తుందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిత్రంలో సాయి పల్లవి Sai Pallavi, నాగచైతన్య naga chaitanya నటన చాలా అద్భుతం. ఈ సినిమాలో బాగా నటించారు. “బుజ్జి తల్లి” సాంగ్ అనేది ఈ సినిమాకే చాలా హైలైట్ గా ఉందని అభిమానులు అంటున్నారు…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.