Home » Entertainment » The Star Hero Who Targeted Honey Rose Like That
Entertainment

Honey Rose : హనీ రోజ్ ని అలా టార్గెట్ చేసిన స్టార్ హీరో

Authored By
Breaking News
The Telugu News | Published on: May 3, 2023, 12:00 pm
Advertisement

Honey Rose : ఈ ఏడాది స్టార్టింగ్ లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన “వీర సింహారెడ్డి” సంక్రాంతి పండుగకు రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. బాలయ్య కెరియర్ లో రికార్డు స్థాయి ఓపెనింగ్ కలెక్షన్స్ ఈ సినిమా రాబట్టింది. ఈ సినిమాలో మలయాళ బ్యూటీ హనీ రోజ్ కీలక పాత్ర పోషించటం జరిగింది. తెలుగులో అంతకు ముందు రెండు సినిమాలు చేసినా కానీ హనీ రోజ్ కి అంతగా గుర్తింపు రాలేదు. కానీ “వీర సింహారెడ్డి” సినిమాలో చేసిన పాత్రతో ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ లభించింది.

Advertisement

The star hero who targeted Honey Rose like that

“వీర సింహారెడ్డి” విజయం సాధించడంలో హనీ రోజ్ ఎంతో దోహద పడింది. ఈ సినిమా హిట్ అవ్వడానికి బాలయ్య మెయిన్ రీజన్ అయితే సెకండ్ రీజన్ హనీ రోజ్ అందాలనే చెప్పాలి . శృతిహాసన్ లాంటి హీరోయిన్ ఉన్న సరే అందరు హనీ రోజ్ పాత్రనే లైక్ చేశారు. ఈ మలయాళ బ్యూటీ అందాలకు.. తెలుగు కుర్ర కారు ఫిదా అయిపోయింది. సినిమా రిలీజ్ అవ్వకముందే కాదు ఆఖరికి “వీర సింహారెడ్డి” ఫ్రీ రిలీజ్ వేడుకలో.. హనీ రోజ్ చాలా హైలెట్ గా నిలిచింది. “వీర సింహారెడ్డి” విజయం తర్వాత హనీ రోజ్ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగుతుంది.

Advertisement

The star hero who targeted Honey Rose like that

చాలామంది హీరోలు ఆమెనే కావాలని కోరుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఓ ప్రముఖ బడా హీరో తన సినిమాలో ఐటమ్ సాంగ్ చేయాలని పట్టు బట్టి మరి కూర్చున్నాడు అట. హనీ రోజ్ చేతే చేయించాలని నిర్మాతల చేత మాట తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఆమెను ఆ బడా హీరో టార్గెట్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. రెమ్యూనరేషన్ ఎంతైనా పర్వాలేదు ఆమె చేతే ఐటమ్ సాంగ్ చేయించాలని సదరు సీనియర్ టాప్ హీరో పంతం మీద ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరి ఈ మలయాళ బ్యూటీ ఆ సాంగ్ చేస్తుందో లేదో చూడాలి.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి