Categories: EntertainmentNews

Ram Charan – Upasana – Twins Names : రామ్ చరణ్ – ఉపాసన .. మెగా వారసుడికి పెట్టబోయే పేరు ఇదేనా..?

Advertisement
Published by
Advertisement

Ram Charan – Upasana : గ్లోబల్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  Ram Charan – ఉపాసన  Upasana  కొణిదెల దంపతులు రెండోసారి తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. జనవరి 31న ఉపాసన కవల పిల్లలకు  twins  జన్మనివ్వడంతో మెగా కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. ఈ కవలల్లో ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఎంతోకాలంగా ఎదురు చూసిన వారసుడి రాకతో మెగా అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వార్త వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ మొదలైంది. అభిమానులు సంబరాలు చేసుకుంటూ మెగా ఇంట మరో పండగ వచ్చిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Ram Charan – Upasana : రామ్ చరణ్ – ఉపాసన .. మెగా వారసుడికి పెట్టబోయే పేరు ఇదేనా..?

Ram Charan – Upasana : చిరంజీవి కోరిక నెరవేరిందా?

మెగా ఫ్యామిలీ  Mega Famil  మూడో తరంలో ఇప్పటివరకు ఎక్కువగా ఆడపిల్లలే జన్మించారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో కూడా ఆడపిల్లలే ఉండడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక మగబిడ్డ పుడితే బాగుంటుందనే కోరికను చిరంజీవి పలు సందర్భాల్లో బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో కొన్ని విమర్శలు కూడా ఎదురయ్యాయి. రామ్ చరణ్ బాలయ్య బాబు హోస్ట్ చేసిన ‘అన్‌స్టాపబుల్’ షోకు గెస్ట్‌గా వెళ్లినప్పుడు కూడా ఆయన తల్లి పంపిన వీడియో సందేశంలో ఇదే కోరికను వెల్లడించిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా రామ్ చరణ్‌కు మగబిడ్డ పుట్టడంతో మెగా కుటుంబ కోరిక నెరవేరినట్టే అన్న భావన అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ఇక వరుణ్ తేజ్‌కు ఇటీవల మగబిడ్డ పుట్టడం ఇప్పుడు రామ్ చరణ్‌కు వారసుడు రావడంతో మెగా క్యాంప్‌లో ఆనందం రెట్టింపు అయింది.

Advertisement

Ram Charan – Upasana : పేర్లు, ఫోటోలపై ఉత్కంఠ

ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది ఒక్కటే రామ్ చరణ్–ఉపాసన తమ కవల పిల్లలకు ఎలాంటి పేర్లు  Names  పెట్టబోతున్నారు? మెగా ఫ్యామిలీలో సాధారణంగా ఆంజనేయ స్వామి లేదా శ్రీరాముడి పేర్లకు సంబంధించిన నామకరణం చేసే సంప్రదాయం ఉంది. కానీ రామ్ చరణ్ మొదటిసారి తన కూతురికి ఆ సెంటిమెంట్‌కు భిన్నంగా ‘క్లిన్ కారా’ అనే పేరు పెట్టారు. ఈ పేరు లలిత సహస్రనామం నుంచి తీసుకున్నదని అప్పట్లో చిరంజీవే వెల్లడించారు. ఇప్పుడు కవల పిల్లల విషయంలో కూడా ఆధ్యాత్మిక అర్థం ఉన్న పేర్లనే ఎంచుకుంటారా? లేక మెగా సంప్రదాయానికి అనుగుణంగా హనుమంతుడు లేదా శ్రీరాముడి పేరు కలిసొచ్చేలా నామకరణం చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా మగబిడ్డకు పేరు ఎవరు పెడతారు అనే అంశంపై నెటిజన్ల మధ్య పెద్ద చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా రామ్ చరణ్ మొదటి కూతురు క్లిన్ కారాను ఇప్పటివరకు బయట ప్రపంచానికి చూపించకపోవడం అభిమానుల్లో కొంత అసంతృప్తిని కలిగించింది. ఫోటోలు కూడా విడుదల చేయకుండా జాగ్రత్త పడటంతో ఈసారి అయినా కవల పిల్లలను పరిచయం చేస్తారా? లేక మళ్లీ అదే గోప్యత కొనసాగిస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదేమైనా మెగా వారసుడి రాకతో అభిమానుల ఉత్కంఠ ఇప్పుడు మరో స్థాయికి చేరింది. చరణ్ తన పిల్లలను ఎప్పుడు ఎలా పరిచయం చేస్తాడో చూడాలి మరి.

Advertisement
Suma Ch

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Recent Posts

Chicken Mutton : డయాబెటిస్ ఉన్నవారు చికెన్, మటన్ తినవచ్చా? తింటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Chicken Mutton : మధుమేహం (Diabetes) ఉన్నవారు తమ దైనందిన ఆహారం విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. రక్తంలో చక్కెర…

6 hours ago

Hibiscus Flower : ముద్దొచ్చే మందారం.. ఆరోగ్యానికి అద్భుత ఔషధం తెలుసా..?

Hibiscus Flower : సాధారణంగా మన ఇంటి పెరట్లో రంగురంగుల మందార పువ్వులు కనిపిస్తుంటాయి. అయితే చాలా మంది వీటిని…

8 hours ago

Tea : ఒక నెల పాటు టీ తాగడం మానేస్తే ఏం జరుగుతుంది.. మీ శరీరంలో జ‌రిగే అద్బుత మార్పులు ఇవే

Tea : భారతదేశంలో టీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. ఉదయాన్నే నిద్రలేవగానే…

10 hours ago

Crimes : హత్యలు.. మృతదేహాల ముక్కలు! నేరస్థుడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా?

Crimes  : ప్రస్తుత సమాజంలో మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోతోంది. కోపం, పగ, అనుమానం వంటి కారణాలతో సన్నిహితులనే…

20 hours ago

TVK Vijay : బిగ్ బ్రేకింగ్‌ : విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు లభించని గవర్నర్ అనుమతి

TVK Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తమిళగ…

22 hours ago

IPL 2026 Playoffs : ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ లెక్కలు: ఏ టీం గెలవాలంటే ఎన్ని మ్యాచ్‌లు ఆడాలి..?

IPL 2026 Playoffs : ఐపీఎల్ 2026 సీజన్ ప్రస్తుతం అత్యంత రసవత్తర దశకు చేరుకుంది. మొత్తం 48 లీగ్…

24 hours ago

Vijay TVK : తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: విజయ్‌కు అన్నాడీఎంకే 35 ఎమ్మెల్యేల మద్దతు? చెన్నైలో రహస్య భేటీ.

Vijay TVK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. దళపతి…

1 day ago

Night Heat Stroke : పగలే కాదు.. రాత్రిపూట కూడా వడదెబ్బ? షాకింగ్ నిజాలు వెల్లడించిన నిపుణులు

Night Heat Stroke : సాధారణంగా వడదెబ్బ అనగానే మనందరికీ మండుటెండలు, మధ్యాహ్నపు వేడి గాలులు మాత్రమే గుర్తొస్తాయి. పగటిపూట…

1 day ago

Prasar Bharati Recruitment 2026 : ప్రసార్ భారతిలో భారీ నోటిఫికేషన్ : నెలకు రూ. 4.20 లక్షల వరకు ప్యాకేజీ ! పూర్తి వివరాలు ఇవే!

Prasar Bharati Recruitment 2026 : భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ పబ్లిక్…

1 day ago

ఈ సమ్మర్‌లో కూల్‌గా, హెల్తీగా ఉండాలంటే.. ఇవే బెస్ట్ డ్రింక్స్! తప్పక తెలుసుకోండి!

భానుడు భగభగమంటున్నాడు. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండటంతో పిల్లలు, పెద్దలు, ముసలివారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తీవ్ర…

1 day ago

AP Housing Scheme 2026 : ఏపీ పేదలకు బంపర్ ఆఫర్ కొత్త ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఖరారు!

AP Housing Scheme 2026 : సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకోవాలనేది ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబం యొక్క దశాబ్దాల…

2 days ago

Husband Wife : దారుణం : భార్య నైటీ వేసుకుని బయట తిరుగుతోందని.. భర్త ఏం చేశాడో తెలుసా?

Husband Wife  : నేటి సమాజంలో మనుషుల ప్రాణాలకు విలువే లేకుండా పోతోంది. చిన్నపాటి మనస్పర్థలు, అనవసరపు అనుమానాలు నిండు…

2 days ago