tollywood actress hema in temple video viral
Actress Hema : తెలుగు నటి హేమ గురించి తెలుసు కదా. తను మీడియా ముందు ఎప్పుడు ఏం మాట్లాడినా అది వివాదానికి దారి తీయాల్సిందే. తాజాగా తను చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలామంది ప్రశాంతత కోసం గుడికి వెళ్తారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం గుడికి వెళ్తారు. కానీ.. గుడిలోనూ మనకు ప్రశాంతత దొరక్కపోతే ఇక ఎలా ఉంటుంది చెప్పండి. చిరాకు వస్తుంది. తీవ్రమైన కోపం వస్తుంది. అసహనం వేస్తుంది. నటి హేమకు కూడా అలాంటి అనుభవమే ఎదురైంది.
ప్రస్తుతం హేమకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇటీవల హేమ.. విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంది. తను గుడికి వచ్చింది అని తెలియగానే మీడియా వాళ్లు అంతా అక్కడికి వెళ్లారు. తన దర్శనం పూర్తయ్యాక ఆమె మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతుండగా తను ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయింది. దానికి కారణం అక్కడ ఉన్న ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్న. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో హేమ.. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది. అయితే..
tollywood actress hema in temple video viral
అమ్మవారిని నేను చూడలేను అని అనుకున్నాను కానీ.. ఆ అమ్మ వారే నన్ను తన దగ్గరికి రప్పించుకున్నారు అంటూ చెప్పుకొచ్చింది హేమ. ఇంతలో ఓ రిపోర్టర్ కల్పించుకొని.. మీరు టికెట్స్ తీసుకున్నారా? లేదా అని ప్రశ్నించాడు. దీంతో ఒక్కసారిగా సీరియస్ అయింది హేమ. ఏంటి గుడిలో కూడా కాంట్రవర్సీ చేయాలనుకుంటున్నారా? అమ్మవారికి నేను రూ.20 వేల రూపాయల చీరను తీసుకొచ్చాను. రూ.10 వేలు హుండీలో వేశాను. నన్ను టికెట్ గురించి అడుగుతున్నారా మీరు.. నేను ప్రోటోకాల్ ప్రకారమే అన్నీ ఫాలో అవుతున్నాను. నేను దుర్గమ్మ భక్తురాలిని. అమ్మవారి కోసం ఇక్కడికి వచ్చా కానీ.. కాంట్రవర్సీ కోసం కాదు అంటూ ఆగ్రహంతో ఊగిపోయింది హేమ. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Today Gold Rate : గత కొన్ని రోజులుగా బంగారం ధరలు నిరంతరంగా పడిపోతూ వస్తున్నాయి. ఏప్రిల్ 22 నుంచి…
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన…
Weight Loss : బరువు తగ్గడం ఎంతో సవాలుతో కూడుకున్నది. ముఖ్యంగా చాలా మంది డైటింగ్, వ్యాయామంతో ఇబ్బంది పడుతున్నప్పుడు.…
Home Loans : ప్రతి ఒక్కరూ జీవితంలో సొంతిల్లు కలను నిజం చేసుకోవాలనే లక్ష్యంతో సేవింగ్స్ ప్రారంభిస్తారు. కొందరు పూర్తిగా…
Dragon Fruit : డ్రాగన్ ఫ్రూట్ లేదా పిటాయా దాని ఆరోగ్య ప్రయోజనాలకు బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ ఉష్ణమండల…
Gas Cylinder : గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగి సామాన్య ప్రజలకు భారంగా మారిన సమయంలో వినియోగదారులకు ఊరట కలిగించే…
Eat Eggs In Summer : ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆహారాలలో ప్రధానమైనవి గుడ్లు. వాటి అధిక ప్రోటీన్ కంటెంట్…
Green Tea : మనలో చాలా మందికి, గ్రీన్ టీ ఆరోగ్యకరమైన జీవనశైలిని వాగ్దానం చేసే అమృతం లాంటిది. ఇది…
This website uses cookies.