Tollywood : సినీ పరిశ్రమలో ఏదైనా సమస్య ఉంటే పెద్దదిక్కుగా వచ్చి ఆ సంస్యకు పరిష్కారం చూపించి.. పెద్దన్నగా అండగా ఉంటూ వచ్చారు శత చిత్ర దర్శకుడు దాసరి నారాయణ రావు. తెలుగు సినిమా పరిశ్రమలో ఏ చిన్న గొడవ అయినా సరే అది ఎలాంటిదైనా సరే దాసరి గారు ప్రత్యక్షమై సమస్య పరిష్కారం చూపించే వారు. ఆపద టైం లో అక్కడ నిలబడి ఉండే వారు. అందుకే ఆయన పరిశ్రమ పెద్ద దిక్కుగా చెబుతుంటారు. ఐతే దాసరి తర్వాత ఆ స్థానం ఎవరు భర్తీ చేయలేదు. కొంతలో కొంత మెగాస్టార్ చిరంజీవిని అందరు పెద్ద దిక్కుగా భావిస్తారు. ఆయనే పెద్దన్నగా భావిస్తూ కొన్ని సమస్యలు ఆయన ముందు ఉంచుతారు. కానీ ఆయన ఒక లీడింగ్ హీరో అయ్యే సరికి అన్ని సమస్యలు ఆయన దగ్గరకు వెళ్లట్లేదు. అంతేకాదు కొన్నిటికి ఆయన కూడా దూరంగా ఉంటున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్న విషయాలు చూస్తే దీని గురించి ముందుకొచ్చి మాట్లాడే వ్యక్తి ఎవరు లేరా అని అనిపిస్తుంది. చిరంజీవి ముందుకొచ్చి మాట్లాడితే బాగుంటుందని అంటున్నారు. తన ఇంటి హీరో సమస్యలో ఉన్నప్పుడు చిరంజీవి సైలెన్స్ కి కారణం ఏంటని చెప్పుకుంటున్నారు. ఇలాంటి టైం లో పై పశ్రమ తరపున ఒక వ్యక్తి తన గొంతు విప్పితే బాగుంటుందని పరిశ్రమ వ్యక్తులు చెప్పుకుంటున్నారు.
ఐతే ఎలాంటి సమస్య అయినా పరిష్కారం ఉంటుంది. ఐతే ఇష్యూ మరీ పెద్ది కాకుండా కాస్త పెద్ద దిక్కుగా మాట్లాడి సమస్యని సాల్వ్ చేస్తే బాగుంటుందని అంటున్నారు. అందుకే దాసరిని గుర్తు చేసుకుంటూ ఆయన ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని అనుకుంటున్నారు. చిరంజీవి పెద్దదిక్కుగా కొందరు నమ్ముతున్నా ఈ టైం లో ఆయన సైలెంట్ గా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మరి ఈ సమస్య గురించి ఎవరు నోరు విప్పుతారు. జరిగిన ఘటన గురించి పరిశ్రమ తరపున ఎవరు ఒకాల్తా పుచ్చుకుంటారు అన్నది తెలియాల్సి ఉంది. Tollywood, Peddadikku, Chiranjeevi, Silence, Allu Arjun Issue
Sai Pallavi : స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఈమధ్యనే అమరన్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో…
Kashmir : సోమవారం కాశ్మీర్ లోయలో తీవ్రమైన చలిగాలులు వస్తుండటంతో దాల్ సరస్సు ఉపరితలం గడ్డకట్టింది. భారత వాతావరణ శాఖ…
Jr NTR : పుష్ప 2 ప్రీమియర్ షో వల్ల మహిళ మృతికి అల్లు అర్జున్ కూడా కారణమే అని…
Jio : రిలయన్స్ జియో తన కొత్త ₹2,025 న్యూ ఇయర్ వెల్‌కమ్ ప్లాన్‌ను ప్రారంభించింది. జియో మొబిలిటీ వినియోగదారులకు…
Ys Jagan : మాజీ సీఎం జగన్ ఇప్పుడు రూటు మార్చారు. వచ్చే ఎన్నికలలో తమ సత్తా చాటాలని భావిస్తున్న…
New Ration Cards : తెలంగాణ ప్రభుత్వం పేదలకి అనేక శుభవార్తలు చెబుతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన పేదలకు…
Chiranjeevi : సంధ్య థియేటర్ తొక్కిసలాట, మహిళ రేవతి మృతి కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు…
Producer Naga Vamsi : ప్రస్తుతం టాలీవుడ్ అంతా కూడా గరం గరంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సంధ్య…
This website uses cookies.