Naga Shaurya : ఘనంగా హీరో నాగశౌర్య వివాహం.. ఎవరిని పెళ్లి చేసుకున్నాడో తెలుసా?
Naga Shaurya : యంగ్ హీరో నాగశౌర్య తెలుసు కదా. ఊహలు గుసగుసలాడే సినిమాతో తనేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఊహలు గుసగుసలాడే సినిమా తర్వాత నాగశౌర్య చాలా సినిమాల్లో నటించాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు నాగశౌర్య. ఛలో, ఓ బేబీ, దిక్కులు చూడకు రామయ్య లాంటి సినిమాల్లోనూ నటించి తన సత్తా చాటుకున్నాడు.
అయితే.. ఈ యువ హీరో తాజాగా ఓ ఇంటివాడయ్యాడు. బెంగళూరులో నాగశౌర్య పెళ్లి ఘనంగా జరిగింది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య నాగశౌర్య వివాహం ఉదయం 11.25కి ఘనంగా జరిగింది. అనూష అనే యువతిని నాగశౌర్య వివాహం చేసుకున్నాడు. వీళ్ల పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తాజాగా విడుదలయ్యాయి.
tollywood hero naga shaurya married anusha shetty
Naga Shaurya : ఇండియన్ టాప్ మోస్ట్ 40 ఇంటీరియర్ డిజైనర్లలో అనూష ఒకరు
సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంటీరియర్ డిజైనర్ అయిన అనూష శెట్టిని నాగశౌర్య వివాహం చేసుకున్నాడు. నాగశౌర్య పెళ్లి చేసుకున్న అనూష ఇండియన్ టాప్ మోస్ట్ 40 ఇంటీరియర్ డిజైనర్లలో ఒకరు. ఆమె ఉమెన్ అచీవర్స్ గానూ గుర్తింపు పొందింది. తనకు ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఉంది. తనది బెంగళూరు కావడంతో అక్కడే కంపెనీ పెట్టింది. అందుకే.. నాగశౌర్య వివాహం కూడా బెంగళూరులో జరిగింది.
