
tollywood JR NTR for bollywood brahmastra movie pre release event
JR NTR : బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం బ్రహ్మాస్త్ర. రణబీర్ కపూర్ హీరోగా అయాన్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన బ్రహ్మాస్త్ర పార్ట్ 1 విడుదలకు సిద్ధమయింది. వచ్చే నెల రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాకు సంబంధించిన తెలుగు పంపిణీ హడావుడి పెద్ద ఎత్తున కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను టాలీవుడ్ జక్కన్న రాజమౌళి సమర్పిస్తున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. భారీ ఎత్తున ప్రమోషన్ చేయడంతో పాటు సినిమా పై ఆయన చాలా నమ్మకంగా ఉన్నాడు. కనుక తప్పకుండా బ్రహ్మాస్త్ర తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుంది అంటూ ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉన్నారు.
ఈ సమయంలోనే బ్రహ్మాస్త్ర సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు, ఆయన వాయిస్ ఇచ్చాడు కనుక సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆయన ముఖ్య అతిథిగా రాబోతున్నారు అంటూ నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది. ఆయన సమర్పించిన లాల్ సింగ్ చడ్డా సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దాంతో ఆయనను పక్కకు పెట్టాలని ఉద్దేశంతో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి దూరం పెట్టారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి రావాల్సిన ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఆహ్వానించారని సమాచారం అందుతుంది.
tollywood JR NTR for bollywood brahmastra movie pre release event
భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న బ్రహ్మాస్త్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి గాను ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రావడం దాదాపుగా కన్ఫర్మ్ అయింది. ఆయన రావడం వెనక టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఉన్నాడంటూ సమాచారం అందుతుంది. రాజమౌళి మరియు ఎన్టీఆర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనడం ద్వారా ఖచ్చితంగా బ్రహ్మాస్త్ర సినిమా కు తెలుగులో విపరీతమైన క్రేజ్ రావడం ఖాయం, తద్వారా మొదటి రెండు మూడు రోజులు భారీ ఎత్తున వసూళ్లు నమోదు అవుతాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా సూపర్ హిట్ అయితే తప్పకుండా మరిన్ని వసూళ్లు నమోదయ్య అవకాశం ఉంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.