Telugu Movies following the same trend Stories of kings
Tollywood Hero : టాలీవుడ్ లో స్టార్ హీరోల్లో ఎక్కువ శాతం మంది నాలుగు.. అయిదు పదుల వయసు దాటిన వారే ఉన్నారు. ఏడు పదుల వయసుకు దగ్గర పడ్డ వారు కూడా స్టార్స్ మరియు సూపర్ స్టార్స్ గా వెలుగు వెలుగుతున్నారు. వారు కూడా ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారు. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలతో పాటు యంగ్ స్టార్ హీరోల వయసు కూడా ముదిరి పాకాన పడుతుంది అన్నట్లుగా మారింది. పలువురు హీరోలు ముఖం ముసలి మొహంగా మారింది. ఈ విషయంలో సినిమా మేకర్స్ కు పెద్ద టాస్క్ గా మారింది. నాచురల్ గా చూపించాలని దర్శకులు అనుకుంటూ ఉన్నా కూడా హీరోలు మాత్రం తమ ఒరిజినల్ ను చూపించేందుకు ఇష్టపడటం లేదు.
హీరోల కోరిక మేరకు మేకప్ తో సగం వయసును గ్రాఫిక్స్ తో మరింత వయసును దాచేందుకు నిర్మాతలు మరియు దర్శకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఒక సీనియర్ హీరో నటిస్తున్న సినిమా షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఆ సినిమా యొక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను మొదలు పెట్టారు. హీరో పాత్ర ముసలి ఛాయలను పోగొట్టేందుకు గాను దర్శకుడు గ్రాఫిక్స్ టీమ్ కు తమ సినిమా ఫుటేజ్ ను ఇవ్వడం జరిగిందట. ఆ గ్రాఫిక్స్ కంపెనీ వారు సదరు సినిమా లో హీరో పాత్ర కు విజువల్ ఎఫెక్ట్స్ చేసేందుకు దాదాపుగా అయిదు కోటల రూపాయలు డిమాండ్ చేశారట.
tollywood senior hero face graphics
హీరో పారితోషికం నుండి తగ్గించి ఇవ్వాలని నిర్మాత కోరుతున్నాడు. అందుకు ఆ హీరో ఒప్పుకోవడం లేదు.. అలా అని గ్రాఫిక్స్ లేకుండా విడుదల చేసేది లేదు అంటున్నాడు. దాంతో దర్శకుడు ఆ అయిదు కోట్ల రూపాయల్లో రెండు కోట్లు తాను ఖర్చు పెట్టుకునేందుకు సిద్దం అయ్యాడట. మిగిలిన మూడు కోట్లను నిర్మాత ఖర్చు చేయాల్సి ఉంటుందట. మొత్తానికి ఇప్పటికే సినిమాల బడ్జెట్ లు భారీగా పెరిగాయి అంటూ ఉంటే ఇప్పుడు ఇది ఒకటి కొత్తగా తయారు అయ్యింది అంటూ నిర్మాతలు గగ్గోలు పెడుతూ ఉన్నారు.
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
This website uses cookies.