Home » Entertainment » Top Heroine Who Is Going To Marry Mp
Entertainment

Star Heroine : ఎంపీ ని పెళ్లి చేసుకోబోతోన్న టాప్ హీరోయిన్ !

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: May 3, 2023, 2:23 pm
Advertisement

Star Heroine : స్టార్ హీరోయిన్లు రాజకీయ నాయకులను పెళ్లి చేసుకోవడం కొత్తేమీ కాదు. అది ఎప్పటి నుంచో ఉన్నదే. రాజకీయ నాయకులే కాదు.. వ్యాపారవేత్తలను కూడా పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం మన బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఒక స్టార్ హీరోయిన్ పెళ్లికి రెడీ అయిపోయింది. అది కూడా ఎవరితోనో తెలుసా? ఫేమస్ రాజకీయ నాయకుడితో. ఆయన ఒక ఎంపీ. ఎవరో తెలుసా? రాఘవ్ చద్దా. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ ఆయన.

Advertisement

వీళ్లిద్దరూ గత కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్ల ఎంగేజ్ మెంట్ కూడా పూర్తయినట్టు సమాచారం. అయితే.. ఇద్దరూ ముంబైలో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. కెమెరాల కంటికి చిక్కుతున్నారు. త్వరలోనే ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారట. వీళ్ల పెళ్లికి ఇరు ఇండ్లలో ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. నిశ్చితార్థం కూడా త్వరలోనే జరగనుందట. కాకపోతే నిశ్చితార్థం తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి పెళ్లి చేసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

Top heroine who is going to marry MP

Star Heroine : ఇప్పుడు వాళ్లది ఓపెన్ సీక్రెట్ వ్యవహారం

పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా ఇద్దరూ కొన్ని ఏళ్ల పాటు సీక్రెట్ గా తమ రిలేషన్ షిప్ ను మెయిన్ టెన్ చేశారు. ఇప్పుడు వీళ్ల విషయం అందరికీ తెలిసిపోవడంతో ఇక బహిరంగంగానే ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. అందుకే కెమెరాలకు కూడా చిక్కుతున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం వాళ్లదే ట్రెండింగ్ టాపిక్. ఎక్కడ చూసినా వాళ్లే కనిపిస్తున్నారు. ప్రస్తుతం పరిణీతి చోప్రా లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన పరిణీతి.. పెళ్లి తర్వాత కూడా ఇండస్ట్రీలోనే కొనసాగాలని అనుకుంటోందట.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి