Prabhas : ఇప్పుడు సౌత్ స్టార్స్ మానియా నడుస్తుంది. మనోళ్లు బీటౌన్‌లోను కుమ్మేస్తుంటే అక్కడి హీరోలు నోరెళ్లపెట్టి చూస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద మార్కెట్ కలిగిన హీరోలుగా టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ హీరోలు అవతరించారు. ఈ జనరేషన్ స్టార్స్ లో ప్రభాస్ ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆయన తర్వాత మిగతా హీరోలు తమ సత్తా చూపించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే పాన్ ఇండియా కేటగిరీలో టాప్ లో ఉంది ఎవరు? టాప్ టెన్ స్టార్స్ ఎవరనే సర్వే నిర్వహించడం జరిగింది. ఇండియా వైడ్ గా ఆడియన్స్ అభిప్రాయాల ఆధారంగా టాప్ టెన్ పాన్ ఇండియా స్టార్స్ చూస్తే.. ఆశ్చర్యపోకమానరు.
ప్రముఖ బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ ఆగస్టు 2022కి గాను నంబర్ వన్ పాన్ ఇండియా సర్వే నిర్వహించగా, ఇందులో స్టార్ గా కోలీవుడ్ హీరో విజయ్ ఎంపికయ్యారు. గత కొన్ని నెలలుగా విజయ్ టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నారు. ఒక్క పాన్ ఇండియా హిట్ లేకున్నా విజయ్ ఈ స్థాయి పాపులారిటీ సంపాదించడం విశేషం. ఇక రెండో స్థానం ప్రభాస్ కి దక్కింది.వరుస ఫ్లాపులు వచ్చిన కూడా ప్రభాస్ టాప్‌లో ఉండడం గమనర్హం.ఇక ఆర్ ఆర్ ఆర్ తో తన రేంజ్ పెంచుకున్న ఎన్టీఆర్ 3వ స్థానం కైవసం చేసుకున్నారు. కాగా పుష్ప మూవీతో సంచలన విజయం నమోదు చేసిన అల్లు అర్జున్ కి ప్రేక్షకులు 4వ ర్యాంక్ కట్టబెట్టారు.
హిందీలో పుష్ప 100 కోట్లకు పైగా వసూళ్లతో అనూహ్య విజయం సాధించిన నేపథ్యంలో అల్లు అర్జున్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకున్న మరొక సౌత్ హీరో యష్. ఈ కన్నడ స్టార్ కెజిఎఫ్ 2 తో ఇండియన్ బాక్సాఫీస్ బద్దలు కొట్టాడు. దీంతో 5వ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. ఇక రామ్ చరణ్ టాప్ ఫైవ్ నుండి కిందకు పడిపోయాడు. రామ్ చరణ్ కి 7వ ర్యాంక్ దక్కింది. మరో టాలీవుడ్ టాప్ స్టార్ మహేష్ కూడా ఈ లిస్ట్ లో అంతగా ప్రభావం చూపలేదు. మహేష్ కి ఆడియన్స్ 8వ ర్యాంక్ కట్టబెట్టారు. అనూహ్యంగా పవన్ కి ఈ లిస్ట్ లో చోటు దక్కలేదు.ఇక బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కి 6వ ర్యాంక్ ,సూర్యకు 9వ ర్యాంక్, అజిత్ కుమార్ కి 10వ ర్యాంక్ దక్కాయి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.