Home » Entertainment » Tribanadhari Barbarik Movie Release On Chiranjeevis Birthday
Entertainment

Tribanadhari Barbarik Movie : చిరంజీవి గారి పుట్టిన రోజు సందర్భంగా త్రిబాణధారి బార్బరిక్ మూవీ విడుద‌ల‌

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: August 5, 2025, 7:40 pm
Advertisement

Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. పాన్ ఇండియన్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ వంటి వారు ప్రధాన పాత్రల్ని పోషించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ క్రమంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో.. సత్య రాజ్ మాట్లాడుతూ .. ‘‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమాలో పని చేసినందుకు ఆనందంగా ఉంది. మేమంతా కూడా మాదే మెయిన్ పాత్ర అని చెప్పుకోవచ్చు. కానీ ఇందులో కథే మెయిన్ హీరో. డైరెక్టర్ మోహన్, నిర్మాత విజయ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ వీళ్లే అసలైన బాణాలు. ఈశ్వర్ గారు నాతో డ్యాన్స్ చేయించారు. రమేష్ గారు మా అందరినీ అద్భుతంగా చూపించారు. డబ్బింగ్‌ చెప్పేటప్పుడు ఇతర సీన్లను కూడా అడిగి చూశాను. కెమెరా యాంగిల్‌తోనే సస్పెన్స్‌ను క్రియేట్ చేశారు. అలా దర్శకుడు, కెమెరామెన్ కలిసి అద్భుతం చేశారు. 70 ఏళ్లు దాటినా కూడా నేను కొత్త కొత్త పాత్రల్ని చేయాలని అనుకుంటున్నాను. రెగ్యులర్ పాత్రల్ని కాకుండా ‘బార్బరిక్’ లాంటి కొత్త పాత్రల్ని మరిన్ని చేయాలని అనుకుంటున్నాను. నా డియర్ ఫ్రెండ్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న ఈ చిత్రం విడుదల కాబోతోంది. చిరంజీవి గారు కంప్లీట్ యాక్టర్. ఆయన గొప్ప నటుడు, డ్యాన్సర్, అద్భుతమైన వ్యక్తి. మా మూవీ ఆయన పుట్టిన రోజున రిలీజ్ అవుతుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

Advertisement

Tribanadhari Barbarik Movie : చిరంజీవి గారి పుట్టిన రోజు సందర్భంగా త్రిబాణధారి బార్బరిక్ మూవీ విడుద‌ల‌

Tribanadhari Barbarik Movie : త్రిబాణధారి బార్బరిక్ మూవీ ఆగస్ట్ 22న విడుద‌ల‌

ఉదయ భాను మాట్లాడుతూ .. ‘నేనేమీ సినిమాలకు దూరంగా ఉండలేదు. నాకు నచ్చిన పాత్రలు వస్తేనే నటిస్తున్నాను. ఆర్టిస్టులకు ఉండే ఆకలిని తీర్చే పాత్రలో ప్రస్తుతం నటించాను. ‘బార్బిరిక్’ చిత్రంలో ఓ ఛాలెంజింగ్ పాత్రను మోహన్ గారు నాకు ఇచ్చారు. ప్రతీ పాత్రను నేను ప్రాణం పెట్టి పోషిస్తాను. నాకు రాజేష్ మంచి స్నేహితుడు. ఆయన ఏ ప్రాజెక్ట్ చేస్తున్నా కూడా నన్ను కన్విన్స్ చేస్తుంటారు. మోహన్ గారు నెరేట్ చేసినప్పుడు ఆ కథ, ప్రతీ సీన్ నా కంటికి కనిపించింది. మన భాషలో ఇలాంటి చిత్రాలెందుకు రావు? అని అంతా అంటుంటారు. అలాంటి వారిని ఆశ్చర్యపరిచేలా మా చిత్రం ఉంటుంది. విజయ్ పాల్ గారు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఇలాంటి నిర్మాతలకు సక్సెస్ వస్తే ఇంకెంతో మందిని పైకి తీసుకు వస్తారు. వశిష్ట చాలా మంచి వ్యక్తి. క్రాంతి ఎనర్జీ నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. సాంచీ, మేఘన అందరం కలిసి ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. రమేష్ గారు మా అందరినీ చక్కగా చూపించారు. సత్య రాజ్ గారితో పని చేయడం మా అదృష్టం. ఆయన ఎంతో ఒదిగి ఉంటారు. ఆయన్నుంచి మేమంతా ఎంతో నేర్చుకున్నాం. ఈ చిత్రం అందరికీ కన్నుల పండువగా ఉంటుంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.

Advertisement

వశిష్ట ఎన్ సింహా మాట్లాడుతూ .. ‘‘త్రిబాణధారి బార్బరిక్’ నాకెంతో ప్రత్యేకం. మోహన్ గారు చెప్పిన కథ విన్నప్పుడే టైటిల్ చాలా కొత్తగా అనిపించింది. కథ, స్క్రీన్ ప్లే చాలా బాగా అనిపించింది. ఇది చిన్న సినిమా అని మోహన్ నాకు ఓ కథ చెప్పారు. కానీ సెట్ మీదకు వచ్చిన తరువాత ఇది చిన్న సినిమా కాదని నాకు అర్థమైంది. ఇంత మంచి చిత్రాన్ని ఇచ్చిన మోహన్ గారికి థాంక్స్. ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. నన్ను ఈ మూవీలో చాలా కొత్తగా చూపించారు. ఇందులో ప్రతీ పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. విజయ్ చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్. సత్య రాజ్‌ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఉదయ భాను గారి ఆరా నెక్ట్స్ లెవెల్. క్రాంతి, సాంచీ, మేఘన, కార్తికేయ అందరూ అద్బుతంగా నటించారు. ఈశ్వర్ కొరియోగ్రఫీ చాలా కొత్తగా ఉంటుంది. కెమెరామెన్ రమేష్ గారు పని రాక్షసులు. నేను చిరంజీవి గారి అభిమానిని. ఆయన బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

ప్రొడ్యూసర్ విజయ్ పాల్ రెడ్డి అడిదెల మాట్లాడుతూ .. ‘మా ‘బార్బరిక్’ చిత్రం ఆగస్ట్ 22న రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి. మా మూవీ నుంచి వచ్చిన పాటలు, టీజర్, ట్రైలర్ మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి’ అని అన్నారు. దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ .. ‘కెమెరా అనే అస్త్రం ఉన్న మీడియానే మా చిత్రాన్ని ఆడియెన్స్ వరకు తీసుకెళ్లాలి. అందుకే మాకు మీడియానే ‘బార్బరిక్’. ‘నీ వల్లే నీ వల్లే’ అనే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే మొదటి బాణం. ‘అనగా అనగా’ అనే పాట రెండో బాణం. ‘ఇస్కితడి ఉస్కితడి’ అంటూ మూడో బాణాన్ని వదిలాం. విజయ్‌ పాల్ రెడ్డి గారు క్లారిటీతో డబ్బులు పెట్టారు. కమిట్మెంట్‌తో నేను ఈ మూవీని చేశాను. క్లారిటీ, కమిట్మెంట్, కంటెంట్ ఉన్న చిత్రమిది. మా బాస్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న మా చిత్రాన్ని రిలీజ్ చేయబోతోన్నాం. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

Advertisement

క్రాంతి కిరణ్ మాట్లాడుతూ .. ‘‘బార్బరిక్’ చిత్రంలో నేను దేవ్ అనే ఓ ముఖ్యమైన పాత్రను పోషించాను. ఈ మూవీని మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న రిలీజ్ కాబోతోంది. ఇదే మాకు పర్ఫెక్ట్ డేట్ అని అనిపించింది. ఇప్పటికే ఈ మూవీని చూశాను. మంచి కథ, మంచి కంటెంట్, ఎమోషన్ అన్నీ కూడా మా చిత్రంలో ఉన్నాయి. ఫస్ట్ సీన్ నుంచి ఎండింగ్ వరకు సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది’ అని అన్నారు.సాంచీ రాయ్ మాట్లాడుతూ .. ‘మా బార్బరిక్ చిత్రం ఆగస్ట్ 22న విడుదల కాబోతోంది. ఇది నాకెంతో ప్రత్యేకమైన చిత్రం. ఈ మూవీ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ మాట్లాడుతూ .. ‘మా ‘బార్బరిక్’ చిత్రంలో నేను ప్రదీప్ అనే ఓ ఇంపార్టెంట్ పాత్రలో పోషించాను. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఆగస్ట్ 22న మా మూవీ రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్ మేఘన మాట్లాడుతూ .. ‘నేను నటించిన ‘బార్బరిక్’ చిత్రం మన బాస్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న రిలీజ్ కాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.కెమెరామెన్ కుశేందర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ .. ‘నేను బాహుబలికి పని చేశాను. ఆ టైంలో సత్య రాజ్ గారితో పరిచయం ఏర్పడింది. నేను పొలిమేర, రజాకార్ వంటి చిత్రాలు చేశాను. ఆ తరువాత మోహన్ నా దగ్గరకు వచ్చి ఈ కథ చెప్పారు. బార్బరిక్ అని చెప్పడంతో ఆశ్చర్యపోయాను. ఇది చాలా కొత్త పాయింట్. ఇలాంటి ఓ సినిమాను నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. విజయ్ పాల్ ఈ సినిమాను అద్భుతంగా నిర్మించారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఆగస్ట్ 22న రాబోతోన్న చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ మాట్లాడుతూ .. ‘మా టీజర్‌ను అందరూ ఆదరించారు. ఇప్పుడు రిలీజ్ డేట్‌ను ప్రకటించాం. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే అని ఆ డేట్ అందరికీ గుర్తుంటుందని ఆగస్ట్ 22న విడుదల చేయబోతోన్నాం. ఇది కంటెంట్ బేస్డ్ మూవీ. కంటెంట్ ఉన్న సినిమాల్ని చూడాలని అనుకుంటే మా చిత్రాన్ని చూడండి’ అని అన్నారు.

కొరియోగ్రాఫర్ ఈశ్వర్ మాట్లాడుతూ .. ‘నేను ఈ చిత్రంలో అన్ని పాటల్ని కంపోజ్ చేశాను. గతంలో ఉదయభాను గారు హోస్ట్ చేసిన షోలో కంటెస్టెంట్‌గా చేశాను. ఇప్పుడు ఆమెకు ఓ పాటను కంపోజ్ చేశాను. వశిష్ట గారిని రొమాంటిక్ యాంగిల్ చూపించిన క్రెడిట్ నాకే దక్కింది. సత్య రాజ్‌ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మోహన్ గారికి, విజయ్ గారికి థాంక్స్. ఆగస్ట్ 22న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి