Trisha : సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. దాదాపు సౌత్ లో స్టార్స్ అందరితో నటించి మెప్పించిన ఈ చెన్నై చిన్నది ఇప్పటికీ తన ఫాం కొనసాగిస్తూ యువ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తుంది. తెలుగులో ఈమధ్య చాలా గ్యాప్ తీసుకున్న త్రిష తమిళ్ లో మాత్రం వరుస సినిమాలతో అదరగొట్టేస్తుంది. అక్కడ స్టార్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ అంటే చాలు త్రిష పేరు ప్రధమంగా వినిపిస్తుంది. ఇదిలాఉంటే త్రిష ఈమధ్యనే తన పొలిటికల్ డ్రీం గురించి చెప్పింది. తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని సీఎం అవ్వాలని ఉందని చెప్పింది. సీఎం దాకా వెల్లడం గురించి పక్కన పెడితే అమ్మడికి పాలిటికల్ ఎంట్రీ డ్రీం ఉందని మాత్రం అర్ధమైంది. ఐతే లేటెస్ట్ గా త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చేస్తుందని టాక్ మొదలైంది.
త్రిష తనకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ అన్నప్పటి నుంచి ఈ వార్తలు ఎక్కువ అయ్యాయి. స్టార్ హీరోయిన్ గా త్రిష ఎప్పటికప్పుడు తన సినిమాలతో ఆడియన్స్ ని అలరిస్తూ వచ్చింది. కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా ప్రేక్షకుల మనసులు గెలిచే పాత్రలు చేసింది. ఐతే త్రిష సొంతంగా పార్టీ పెడుతుందా లేదా ఏదైనా పార్టీలో చేరుతుందా అన్నది తెలియదు.
ఈమధ్య ఒక స్టార్ హీరోతో త్రిష సీక్రెట్ ఎఫైర్ గురించి కోలీవుడ్ లో న్యూస్ హల్ చల్ చేస్తుంది. ఆ హీరో ఈమధ్యనే ఒక పార్టీ పెట్టి ఫుల్ టైం పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరి త్రిష కూడా అతని పార్టీలోనే చేరుతుందా లేదా మరో పార్టీ లో కి వెళ్తుదా అన్నది చూడాలి. త్రిష పొలిటికల్ ఎంట్రీ కన్ ఫర్మ్ అయితే మాత్రం ఇక సినిమాలకు దాదాపు ఫుల్ స్టాప్ పడినట్టే లెక్క. ప్రస్తుతం త్రిష తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటు కోలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తుంది అమ్మడు. Trisha, Trisha krishnan, Kollywood, Political Party, Tamilnadu
Nabha Natesh : సుధీర్ బాబు ఎందరో మహానుభావులు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నభా నటేష్ ఆ తర్వాత…
Sreshti Varma : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ Johnny Master శ్రేష్టి Sreshti Varma విషయం తెలిసిందే. తనని వాడుకున్నాడని…
Vijayasai Reddy : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండగా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సిపి)…
PM Kisan : రైతులకు కేంద్రం శుభవార్త. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద, అర్హత…
AIYF : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వయోపరిమితిని పెంచే ప్రతిపాదనకు ప్రయత్నాలు చేస్తున్నదని, ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని అఖిల భారత…
Ysrcp : విజయ సాయి రెడ్డి రాజకీయాల నుంచి వైదొలగాలని తీసుకున్న నిర్ణయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు,…
RBI : నేటి ప్రపంచంలో వివిధ ప్రభుత్వ సౌకర్యాలు, రాయితీలు మరియు ఆర్థిక సేవలను పొందేందుకు బ్యాంకు ఖాతా కలిగి…
Clove Powder : మనం తరచూ పాలని తాగుతూ ఉంటాం. తలలో పోషక విలువలు చాలా ఎక్కువగానే ఉంటాయి. అవి,…
This website uses cookies.