Home » Entertainment » Trivikram Sweet Warning To Rajamouli
Entertainment

Trivikram : ఓరినీ త్రివిక్రమ్ మామూలోడు కాదుగా .. రాజమౌళి కి జన్మలో సాధించలేని ఛాలెంజ్ విసిరాడు !

Authored By
Sam C
The Telugu News | Published on: October 3, 2022, 7:30 pm
Advertisement

Trivikram: ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్‌లో రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్ ఉంటారు. రాజ‌మౌళి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కులు మెచ్చే సినిమాలు చేస్తుండగా , త్రివిక్ర‌మ్ ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాసే చిత్రాలు చేస్తున్నాడు. అయితే రాజ‌మౌళి.. త్రివిక్ర‌మ్ కన్నా ఓ మెట్టు పైనే ఉన్నాడు. ఇప్పుడు త్రివిక్ర‌మ్ ఆ స్థాయికి చేరుకోవాల‌నుకున్న‌ట్టు తెలుస్తుంది. స్వాతిముత్యం సినిమా విడుద‌ల సంద‌ర్భంగా సూర్య‌దేవ‌ర నాగవంశీ మాట్లాడుతూ.. ఎప్పటికైనా హాలీవుడ్ రేంజ్ సినిమా త్రివిక్రమ్ తో చేయాలన్నది తన కోరిక అన్నారు. అది ఎలాంటి సినిమా, ఎవరితో సినిమా అన్నది ఆ టైమ్ వచ్చినపుడు డిసైడ్ చేస్తామన్నారు.

Advertisement

త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రభాస్, రామ్ చరణ్ లతో చెరో సినిమా చేసే ఆలోచన వుందన్నారు. మహేష్ బాబు సినిమా కొత్తగా వుంటుందని నాగవంశీ తెలిపారు. ఈ సినిమా మార్కెట్ ఏ రేంజ్ లో వుంటుందన్నది ఇంకా అంచనా లేదన్నారు. ఆయ‌న మాట‌ల‌ని బ‌ట్టి చూస్తుంటే రాజ‌మౌళి రేంజ్‌లో పాన్ ఇండియా డైరెక్ట‌ర్ అవ‌తారంలోకి త్రివిక్ర‌మ్ మారేందుకు రెడీగా ఉన్నాడు. అందుకే ఆయ‌నకు స‌న్నిహితంగా ఉన్న నాగ‌వంశీ పై వ్యాఖ్య‌లు చేసిన‌ట్టుగా ఉంది. రానున్న రోజుల‌లో రామ్ చ‌ర‌ణ్‌, ప్ర‌భాస్‌ల‌తో త్రివిక్ర‌మ్ అద్భుతం చేసి పాన్ ఇండియా చిత్రాల రికార్డులు చెర‌పాల‌ని అనుకుంటున్నాడ‌ట‌.

trivikram sweet warning to rajamouli

Advertisement

Trivikram : ఏం చేస్తారు..

ఇక ప్రభాస్ తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నట్లు గత కొన్ని నేలల కాలంలో చాలాసార్లు కొన్ని రూమర్స్ అయితే వైరల్ అయ్యాయి. త్రివిక్రమ్ కూడా గతంలో రెండు మూడు సార్లు కలిసినప్పటికీ ఈ కాంబినేషన్ అయితే సెట్ కాలేదు. మరి మహేష్ బాబు సినిమా తర్వాత అయినా ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో చూడాలి. ఇక త్రివిక్రమ్ తర్వాత అల్లు అర్జున్ తో మరో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు ఇదివరకే టాక్ వచ్చింది. కానీ అందులో నిజం లేదని నాగవంశీ అన్నారు. ఏదేమైన త్వ‌ర‌లో త్రివిక్ర‌మ్ అద్భుతాలు సృష్టించే ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి