
Comedian Ali : మొత్తానికి ఆలీ అడ్డంగా దొరికిపోయాడుగా.. ఓ రేంజ్‌లో ట్రోలింగ్
Comedian Ali : బాల నటుడిగా ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత హీరోగా, కమెడీయన్‌గా రాణించాడు. ప్రస్తుతం కెరీర్‌లో బిజీగా ఉన్నారు. సినిమా పరిశ్రమలో అందరివాడుగా పేరున్న కమెడియన్ ఆలీ మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అప్తుడిగా పేరు తెచ్చుకొన్నాడు. పవన్ నటించే సినిమాలో ఆలీ తప్పకుండా ఉండేవారంటే.. వారిద్దరి మధ్య అనుబంధానికి చిహ్నంగా ఉండేవారు. అయితే తన సన్నిహితుడిని విభేదించి ఆలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుండి ఆలీపై కాస్త వ్యతిరేఖత నెలకొంది. గత ఎన్నికల్లో ఆలీ పోటీ చేయడానికి ఉత్సాహం చూపారు. అయితే ఆయన పేరును పార్లమెంట్ అభ్యర్థిగా పరిశీలించారు.
నంద్యాల గానీ, కర్నూలు స్థానం నుంచి పోటీ చేసేలా హామి కూడా ఇచ్చారని సమాచారం. అయితే ఆయనకు సీటు కేటాయించకపోవడంతో మరింత నిరాశకు గురయ్యారు. అలాగే జగన్ వ్యవహరించే తీరు కూడా నచ్చకపోవడం కూడా ఓ కారణంగా మారిందంటారు. అప్పటి నుంచి పార్టీ క్రీయాశీలక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల స్నేహితులు, సన్నిహితుల సూచన మేరకు సినిమా కెరీర్‌ను కొనసాగించేలా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడికి రాజీనామాను చేరవేశారు. దాంతో ఆయన రాజకీయ ప్రస్థానానికి బ్రేక్ పడింది.
Comedian Ali : మొత్తానికి ఆలీ అడ్డంగా దొరికిపోయాడుగా.. ఓ రేంజ్‌లో ట్రోలింగ్
ఇక ఆలీ అప్పుడప్పుడు ప్రకటనలలో కూడా కనిపించి సందడి చేస్తుంటారు. తాజాగా ఓ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియా జనాలకు దొరికిపోయారు. గతంలో ఇదే అలీ బెట్టింగ్ ల వేయద్దంటూ గొప్పగా చెప్పి మన్ననలు పొందారు. ఇప్పుడు తనే ఓ బెట్టింగ్ యాప్ ని డబ్బులకి ఆశపడి ప్రమోట్ చేయటంతో జనాలు జీర్ణించుకోలేకపోయారు. చెప్పిన మాటకు చేసే చేష్టకు సంభంధం లేదా అంటున్నారు. అలీతో సరదాగా టైమ్ లో అలీ శివాజీని ఓ ఇంటర్వ్యూ చేసినప్పుడు బెట్టింగుల జోలికి పోవొద్దని, జీవితాలు నాశనం చేసుకోవొద్దని, డబ్బులు సంపాదించకపోయినా ఫర్వాలేదు కానీ, ఇలా ఈజీ మనీ కోసం ఆశ పడొద్దని నీతులు చెప్పి ఇప్పుడు బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదించుకొంటున్నాడని తిట్టి పోస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా బంగారం ధరలు మునుపెన్నడూ లేని విధంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 19 ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది. హాస్పిటల్‌కు…
Super Foods : ఆరోగ్యంగా ఉండాలంటే ఖరీదైన డైట్లు విదేశీ సూపర్ ఫుడ్స్ తప్పనిసరి అనే భావన ఇప్పుడు మారుతోంది.…
Ratha Saptami 2026: సనాతన ధర్మంలో సూర్య భగవానుడిని ప్రత్యక్ష దైవంగా ఆరాధిస్తారు. సమస్త లోకాలకు వెలుగును శక్తిని అందించే…
Chicken with skin vs without skin: చాలామందికి చికెన్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. కొందరైతే ప్రతిరోజూ తినమన్నా…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Vijayasai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ కీలక నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన…
School Holidays : సంక్రాంతి పండుగతో ముగిసిన సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న వేళ, ఈ నెలాఖరులో విద్యార్థులకు…
This website uses cookies.